ముఖ్యంగా చెప్పాలంటే అది శేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైన వరం కోరుకోమని అడిగితే, అప్పుడు ఆదిశేషుడు తమ ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు.
ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు శుక్లపక్షం రోజున ప్రజలు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు.
"""/" /
అయితే ఈ సంవత్సరం నాగ పంచమినీ ఆగస్టు 21వ తేదీన భక్తులు జరుపుకొనున్నారు.
ఈ నాగ పంచమి రోజున భక్తులు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల నాగేంద్రుడి ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
నాగపంచమి రోజున నాగులనీ పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు అంతే కాకుండా భక్తులు( Devotees ) పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు.
"""/" /
అంతే కాకుండా నాగ పంచమి రోజున విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పోయడం ఎంతో మంచిది.
అలా చేయడం వలన పూజ చేసిన వారికి విష బాధలు ఉండవని పండితులు చెబుతున్నారు.
అలాగే ప్రతి రోజు నాగపంచమి రోజున సర్ప స్తోత్రాన్ని చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు, రోగాలు రావు.