మొబైల్ ఉత్పత్తిలో భారత్ 2వ స్థానం... ఏకంగా 200 కోట్ల డివైజెస్!

అవును, భారత్( India ) కి ఇదొక మైలురాయి అని చెప్పుకోవచ్చు.కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా( Make in India )’ నినాదమే ధ్యేయంగా 2014-2022 కాలంలో దేశీయంగా తయారైన మొబైల్ ఫోన్‌ల షిప్‌మెంట్‌లు 2-బిలియన్ మార్కును అధిగమించేసింది.

 India Is The 2nd Place In Mobile Production... 200 Crore Devices , Mobile Produ-TeluguStop.com

గ్లోబల్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌ పాయింట్ నివేదిక ప్రకారం, మొబైల్ ఫోన్ షిప్‌మెంట్‌లలో భారతదేశం 23 శాతం CAGR (కంపౌండ్ అన్యువల్ గ్రోత్ రేటు) రిజిస్టర్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.దేశంలో డిమాండ్ పెరగడం, పెరుగుతున్న డిజిటల్ లిటరసీ అండ్ స్ట్రాటజిక్ గవర్నమెంటల్ సపోర్ట్ ఈ వృద్ధికి దారితీస్తున్నాయని నివేదిక పేర్కొంది.

Telugu Indian, Latest, India, Products-Latest News - Telugu

ఈ పరిణామాలతో భారతదేశం ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారిగా ఎదిగి, తన కీర్తిని దిగంతాలకు చేరవేసింది.స్థానిక వస్తువు తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI), అండ్ ఆత్మ-నిర్భర్ భారత్ వంటి అనేక కార్యక్రమాలను స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.కాగా ఇటీవలి సంవత్సరాలలో ఈ పథకాలు దేశీయంగా మొబైల్ ఫోన్ తయారీని పెంచడానికి సహాయపడుతున్నాయి.కౌంటర్‌పాయింట్‌లోని రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి స్థానిక తయారీ సంవత్సరాలుగా గణనీయంగా విస్తరించిందని హైలైట్ చేశారు.

Telugu Indian, Latest, India, Products-Latest News - Telugu

2022లో భారతదేశం నుండి 98 శాతం మొబైల్ ఫోన్ షిప్‌మెంట్‌లు స్థానికంగా తయారు చేయబడినవే.ఈ క్రమంలో మొబైల్ ఫోన్‌లు ఇంకా విడిభాగాల కోసం తయారీ యూనిట్లను స్థాపించే కంపెనీలను ఇంకా పెంచుతున్నట్టు తెలుస్తోంది.అదే గాని నిజమైతే ఉద్యోగావకాశాలు ఇంకా పెరిగి పరిశ్రమ మొత్తం అభివృద్ధికి దోహదపడతాయి.ఈ విజయాల ఆధారంగా, భారత ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని ‘సెమీకండక్టర్ల తయారీ ( Semiconductors )ఇంకా ఎగుమతి కేంద్రం’గా నిలబెట్టడానికి దాని వైడ్ రేంజ్ పథకాలను ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం.

అవును, ప్రస్తుతం భారత్‌ను సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube