బొప్పాయితో బాడీ సోప్‌.. వాడితే మ‌స్తు బెనిఫిట్స్‌!

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో పోష‌కాల‌ను అందిస్తుంది.

 How To Make Soap With Papaya? Soap With Papaya, Papaya Soap, Soap, Latest News,-TeluguStop.com

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికి, కేశ సంర‌క్ష‌ణ‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాంటి బొప్పాయి పండుతో బాడీ సోప్‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు లేటు బొప్పాయి పండుతో బాడీ సోప్‌ను ఎలా చేయాలి.? అస‌లు ఈ సోప్ ను వాడ‌టం వ‌ల్ల వ‌చ్చే స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఏంటీ.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

ముందుగా బాగా పండిన బొప్పాయి పండును తీసుకుని పైతొక్క మ‌రియు లోప‌లి గింజ‌లు తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బొప్పాయి ముక్క‌లు వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక సోప్ బేస్ తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.మీకు సోప్‌ బేస్ దొర‌క్క పోతే గ‌నుక దాని బ‌దులుగా పియ‌ర్స్ సోప్‌ను కూడా వాడొచ్చు.

ముక్క‌లుగా క‌ట్ చేసుకున్న సోప్ బేస్‌ను ఒక గిన్నెలో వేసి డ‌బుల్ బాయిల‌ర్ ప‌ద్ధ‌తిలో మెల్ట్ చేసుకోవాలి.సోప్ బేస్ మెల్ట్ అవ్వ‌గానే అందులో బొప్పాయి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై అందులో ఒక టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్, రెండు లేదా మూడు చుక్క‌లు రోజ్మేరీ ఆయిల్ వేసి మ‌ళ్లీ క‌లుపుకోవాలి.

ఇప్ప‌డు చిన్న చిన్న ప్లాస్టిక్ గిన్నెలు తీసుకుని.

వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి.అనంత‌రం త‌యారు చేసుకున్న సోప్ మిశ్ర‌మాన్ని అందులో పోసి రెండు గంట‌ల పాటు వ‌దిలేస్తే బొప్పాయి బాడీ సోప్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ సోప్ను రోజూ వాడితే చ‌ర్మం వైట్‌గా, బ్రైట్‌గా మ‌రియు స్మూత్‌గా మారుతుంది.పొడి చ‌ర్మం స‌మ‌స్య ఉండ‌దు.

మ‌రియు చ‌ర్మంపై ఏమైనా మ‌చ్చ‌లు ఉన్నా అవి క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube