సెంబి… ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మాత్రమే వినిపిస్తుంది. కోవై సరళ ఇప్పటివరకు తనలోని కామెడీ టైమింగ్ తో జనాలను నవ్వించింది.
కానీ మొట్టమొదటిసారిగా ఎవరు ఊహించని ఒక సినిమాతో ఆమె నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.ఒక సీరియస్ పాత్రతో, తన ఎమోషన్స్ తో, మనవరాలిపై ప్రేమతో ఆమె నటించిన విధానం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.
ఇప్పటివరకు తెలుగు తమిళ సినిమాల్లో ఆమె నవ్వించడం వరకే పరిమితమైంది.కానీ తనలోని నటిని చూపించే విధంగా ఒక బరువైన పాత్ర ఇస్తే కోవై సరళ ఎలా నటిస్తుందో విశ్వరూపం చూపించిన సినిమా సెంబి.
ఈ మధ్యకాలంలో కమీడియన్స్ కూడా హీరోల కంటే ఎక్కువగా క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు.ఆడ, మగ అని పక్కన పెడితే ప్రతి కమీడియన్ హీరో అయిపోవాలని కలలు కంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ అర్థం అయిన తర్వాత కామెడీని వదిలేసినందుకు బాధపడుతూ తిరిగి తమ సొంత గూటికి చేరుకుంటున్నారు.ఇంతటి ఎమోషన్స్ కలిగి ఉన్న పాత్ర కనక మన కమీడియన్స్ కి ఇస్తే ఖచ్చితంగా ఒప్పుకోరు.
పోనీ హీరోలు ఎవరైనా చేస్తారా అంటే అది కూడా జరిగే ప్రసక్తే లేదు.ఎంతసేపు ఫైట్స్ చేసామా ? హీరోయిజం చూపించామా అనే కోణంలోనే మన సినిమాలు ఉంటాయి.మన తెలుగు సినిమాల్లో ఇలాంటి ఒక లేడీ మరియు చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రమే ఉన్న సినిమా తీయాలంటే దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.
ఎందుకు ఇలాంటి సినిమాలు తీయడం లేదు అని మన తెలుగువారిని ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒకటే.మనం తీస్తే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు చూడరు అని.పైగా కామెడీ కోసమే అన్నట్టుగా చాలా సినిమాలు వస్తున్నాయి కదా అంటారు.అల్లరి నరేష్ తీసిన కామెడీ బోర్ కొట్టి మళ్ళీ కమెడియన్ గా ఒక చిత్రం తీయాలంటే భయపడే స్థాయిలో ఉన్నాడు ప్రస్తుతం.మరి ఇప్పటికైనా మేల్కొని ఒక మంచి కథతో సినిమా తీయండి.
అది ఎవరు తీసిన జనాలు చూస్తారు.చిన్నారులపై లైంగిక దాడులను అనే అంశం కూడా మంచి కథా వస్తువు గా మారిపోయింది.