నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన విషాదంలో 8 మంది తమ ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే.ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ సభకు జరగని విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడి సభకు ఇలా జరగడం చాలా దురదృష్టకరం… పైగా ఇది ఎన్నికల సమయం కూడా కాకపోయే.
మరి అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమి అయు ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు పలువురు విశ్లేషిస్తున్నారు.
ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి సభ.! వేల సంఖ్యలో జనం వస్తారు… తొక్కిసలాట మామూలే కానీ ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం అనేది దురదృష్టకరం అని సరిపెట్టుకోవచ్చు.అయితే ఇక్కడ పోలీసు యంత్రాంగం ఎంతలా విఫలమైందో చాలామందికి తెలియదు.
ఈ సభకు ముందు బొబ్బిలి, విజయనగరంలో చంద్రబాబును చూసినందుకు జనాలు పోటెత్తారు.ఇక కందుకూరులో ఇలాంటి ఒక సభ జరగనుందని వారం రోజులు ముందు నుండే ప్రచారంలో ఉంది.
అలాంటి సమయంలో పోలీసు వారు ఎంతో అప్రమత్తంగా ఉండి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవలసిన అవసరం ఉంది.
మొన్న జరిగిన విజయనగరం సభను ఉదాహరణగా తీసుకొని పోలీసు వారు ప్రత్యేక శ్రద్ధతో టిడిపి నేతలను హెచ్చరించి ఉన్నా… భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను అదిలించి ఉన్నా… రెవెన్యూ యంత్రాంగం ముందునుండే సరైన ఏర్పాట్లు చేసి ఉన్నా… ఇలాంటి ఘోర నష్టం వాటిల్లేది కాదని అంటున్నారు.
పైగా తొక్కిసలాట సమయంలో వీరు చాలా నింపాదిగా వ్యవహరించారట.ఇందుమూలంగానే 8 మంది అమానుషంగా డ్రైనేజీలో పడి చనిపోవడం జరిగింది అని అక్కడి వారు చెబుతున్నారు.

ఇలా ప్రతిపక్ష నాయకుడు సభని లైట్ తీసుకోవడం, అతనికి పెరుగుతున్న ప్రజాధరణ గ్రహించలేకపోవడం, ముందు చూపు లేకపోవడం, ఘటన జరిగే సమయంలో త్వరగా స్పందించకపోవడం బాధ్యతరాహిత్యాన్ని ప్రదర్శించడం వంటి కారణాలు అమాయకుల ప్రాణాలు తీసాయని చెప్పుకోవచ్చు.మరి ఈ ఘటనకు సంబంధించి కేసు రిజిస్టర్ చేశారు.రానున్న రోజుల్లో ఇది ఏ దారి మళ్ళుతుంది అన్నది చూడాలి.







