నగరాలు, పట్టణాలలో ఉండే వారు ఏదో ఒక సందర్భంలో షాపింగ్ మాల్స్ సందర్శించి ఉంటారు.ముఖ్యంగా ప్రస్తుతం క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు ఉండడంతో చాలా మంది షాపింగ్ చేస్తుంటారు.
షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు మాల్స్ మరియు ఆఫీసులలో టాయిలెట్ తలుపులు దిగువ భాగంలో ఓపెన్‌గా ఉంటాయి.అయితే ఇలా ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
టాయిలెట్ తలుపులు చిన్నగా ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.చిన్న టాయిలెట్ తలుపులు కలిగి ఉండటం మొదటి, ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే అవి మన్నికైనవి.
టాయిలెట్లను శుభ్రం చేయడం సులభంగా ఉంటుంది.
నీరు, తేమ కారణంగా భూమికి దగ్గరగా ఉన్న టాయిలెట్ తలుపులు తరచుగా దెబ్బతినే అవకాశం ఉంది.
చిన్న టాయిలెట్ తలుపుల ప్రయోజనాలు కేవలం నిర్వహణ లేదా మన్నికకు మాత్రమే పరిమితం కాదు.టాయిలెట్ ఉపయోగించే వ్యక్తి ఏదైనా ఆకస్మిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నట్లయితే, అది సులభంగా తెలుస్తుంది.
తద్వారా తలుపును తెరిచి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడే అవకాశం ఉంటుంది.ఇదే కాకుండా కొంత మంది టాయిలెట్లలో శృంగార కార్యకలాపాలు చేస్తుంటారు.
ఇలాంటి వాటిని అరికట్టడానికి టాయిలెట్ డోర్ కింది భాగం తెరిచి ఉంటే ఉపయోగపడుతుంది.ఇతరులు చూస్తారనే భయంతో అలాంటి పనులు ఎవరూ చేయరు.
దీంతో పాటు టాయిలెట్లో ఎవరైనా ఉంటే బయటి వారికి తెలుస్తుంది.వారు మరో టాయిలెట్లోకి వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది.
మరుగుదొడ్ల లోపల ధూమపానం చేసే అలవాటు కొందరికి ఉంటుంది.పూర్తిగా మూసి ఉన్న టాయిలెట్లలో ధూమపానం చేయడం ప్రమాదకరం.
అలాంటి వాటిలో ఎవరు ధూమపానం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం.అయితే కింది భాగంలో తెరిచి ఉన్న టాయిలెట్లలో ధూమపానం ఎవరు చేసినా వెంటనే తెలుస్తుంది.టాయిలెట్ల తలుపులు అవసరమైన సమయాల్లో, తలుపులు తెరవాల్సిన అవసరం లేకుండా టిష్యూ పేపర్, వార్తాపత్రికలు మరియు మొబైల్ ఫోన్ల వంటి అవసరమైన వస్తువులను మార్పిడి చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తాయి.