అలాంటి బంధాన్ని నేను కోరుకోవడం లేదు.. మమతా మోహన్ దాస్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మమతా మోహన్ దాస్( Mamata Mohandas ) కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటున్నారు.మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న మహారాజా సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించారు.

 Mamatha Mohandas Comments About Relationship Details Here Goes Viral In Social-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో డేటింగ్ గురించి మాట్లాడిన ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లాస్ ఏంజెల్స్ లో ఉన్న సమయంలో ఒకరిని ప్రేమించానని ఆమె పేర్కొన్నారు.

అయితే ఆ ప్రేమ బంధం ఎక్కువ రోజులు నిలవలేదని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చారు.లైఫ్ లో రిలేషన్ ఉండాలని అయితే ఒత్తిడితో కూడిన రిలేషన్ ను మాత్రం నేను కోరుకోవడంలేదని ఆమె పేర్కొన్నారు.లైఫ్ లో కచ్చితంగా ఒక తోడు అవసరం అని నేను భావించడం లేదని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతానికి నేను చాలా సంతోషంగా ఉన్నానని అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేనని ఆమె అన్నారు.

మంచి జీవిత భాగస్వామి కోసం నేను వెతుకుతున్నానని సమయం వస్తే అన్నీ బయటకు వస్తాయని ఆమె వెల్లడించారు.మలయాళీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందని మమతా మోహన్ దాస్ పేర్కొన్నారు.నేను పోషించిన ఎన్నో పాత్రలకు అగ్ర నటీనటుల నుంచి ప్రశంసలు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో స్టార్స్ తో పని చేసే అవకాశం దక్కిందని మమత తెలిపారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ ప్రశంసలు పొందానని ఆ ప్రశంసలు ఎప్పటికీ మరిచిపోలేనని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చారు.మహారాజా సినిమా( Maharaja )తో మమతా మోహన్ దాస్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.

మహారాజా సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube