సీనియర్ నటీమణులలో ఒకరైన కవితకు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ప్రస్తుతం ఈ నటి పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.
సింపుల్ గా ఉండటానికి ఇష్టపడే నటీమణులలో ఒకరు కాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కవిత మాట్లాడుతూ ఫైటర్స్ యూనియన్ వాళ్లు మ్యారేజ్ చేసుకుని మీరు వెళ్లిపోతున్నారు మాకు యూనియన్ ఆఫీస్ లేదు ఇబ్బంది పడుతున్నామని చెప్పగా వాళ్లకు డొనేషన్ ఇచ్చానని అన్నారు.

అదే విధంగా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కూడా నేను అమౌంట్ ఇచ్చానని కవిత చెప్పుకొచ్చారు.గ్రూప్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కు కూడా నేను అమౌంట్ ఇవ్వడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.నేను ఫుడీ కాదని పెద్ద జ్యూవెలరీల మీద నాకు ఆశ లేదని కవిత అన్నారు.నేను చాలా సింపుల్ పర్సన్ అని కవిత చెప్పుకొచ్చారు.కాటన్ శారీలు కట్టుకోవడానికి నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని ఆమె అన్నారు.

100 రూపాయల విలువ చేసే కాటన్ చీరలు అంటే నాకు చాలా ఇష్టమని కవిత చెప్పుకొచ్చారు.మా ఆయన నేను పట్టుచీరలు ధరిస్తే ఇష్టపడతాడని కవిత తెలిపారు.నా కోరిక ఎలా ఉంటుందంటే నవారు మంచం, గేదెలు, ఆవులు ఉంటే ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.
నేను చెన్నైలో పెట్టుకున్నానని చెబితే ఎవరూ నమ్మరని ఆమె కామెంట్లు చేశారు.నాకు హార్స్ ఇష్టమని చెబితే నా భర్త ఒక గార్డెన్ ను మొదట కొని ఆ తర్వాత ఒక గుర్రాన్ని కూడా కొన్నారని ఆమె వెల్లడించారు.
అప్పట్లోనే నేను బీచ్ కు వెళ్లి హార్స్ రైడింగ్ చేశానని కవిత చెప్పుకొచ్చారు.ఎవరు ఏమనుకున్నా నాకు పల్లెటూరి వాతావరణం ఇష్టమని ఆమె అన్నారు.
నేను ప్యూర్ వెజిటేరియన్ అని పప్పు ఇష్టమని కవిత తెలిపారు.మా అత్తగారికి ఉన్న ఏడుగురు కోడళ్లలో నేను బెస్ట్ అని చెబుతారని ఆమె వెల్లడించారు.








