టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్( Sharwanand ) ఒకరు.ఈయన తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
శర్వానంద్ ఈ మధ్య మంచి హిట్ అందుకోలేక రేసులో వెనుకబడి పోయాడు.అయితే ఈయన లాస్ట్ సినిమా ఒకే ఒక జీవితం తో మంచి హిట్ అందుకున్నాడు.
ఈ సినిమాతో శర్వానంద్ అందరిని ఎమోషనల్ కు గురి చేసి అందరికి కనెక్ట్ అయ్యాడు.

ఈ సినిమా కంటే ముందు శర్వానంద్ అన్ని రొటీన్ లవ్ స్టోరీలనే చేసేవాడు.కానీ ఒకే ఒక జీవితం హిట్ తర్వాత ఈయన తన పంథా మార్చుకుని కొత్తగా కంటెంట్ ఉన్న సినిమాను ఎంచుకున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక నవల ఆధారంగా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉండగా ఈయన పర్సనల్ లైఫ్ లో కూడా ఫ్యాన్స్ కు ఇటీవలే ఒక శుభవార్త అందించాడు.

హఠాత్తుగా ఎంగేజ్మెంట్ చేసుకుని స్వీట్ షాక్ ఇచ్చాడు.శర్వానంద్ రక్షిత( Rakshitha reddy ) తో ఎంగేజ్మెంట్ అయ్యింది.అయితే పెళ్ళికి గ్యాప్ రావడంతో క్యాన్సిల్ అయినట్టు వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన పెళ్లి జూన్ 2, 3 తేదీలలో తెరకెక్కుతున్నట్టు టాక్.

ఈ వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జైపూర్ లీలా ప్యాలెస్( Leela Palace ) లో రాగానున్నట్టు తెలుస్తుంది.జూన్ 2, 3 తేదీల్లో ఈ వేడుకలు జరగనుండగా దీనికి కొద్దీ మంది బంధుమిత్రులు మాత్రమే హాజరవ్వనున్నారు.ఇక ఈ కపుల్ కు ఇప్పుడు ఫ్యాన్స్ నుండి మాత్రమే కాకుండా సినీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.







