మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పెళ్లిళ్లు చేసుకోవటంలో బాగా ఆలస్యం చేస్తూ ఉంటారు.ఇప్పటికే టాలీవుడ్ లో ప్రభాస్ పాటు మరి కొంతమంది హీరోలు పెళ్లిళ్లు చేసుకోకుండా ఒంటరిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక వాళ్లు కూడా పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టేస్తున్నారు.కానీ ప్రభాస్ మాత్రం అలాగే ఉండిపోతున్నాడు.
అయితే తాజాగా మరో హీరో అడవి శేష్( Adivi Sesh ) కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో అడవి శేష్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.
హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.ప్రతి ఒక్క సినిమాలో హీరోగా తన పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.అడవి శేష్ తొలిసారిగా 2010లో కర్మ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నాడు.ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను నిలుపుకున్నాడు.ఇక 2018 లో విడుదలైన గూఢచారి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఈ సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఉంటాడు.
నిజానికి ఈయన ఎంచుకునే సినిమాలు అన్ని చివర్లో మంచి విషయాన్ని అందిస్తూ ఉంటాయి.ప్రస్తుతం ఈయన ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి.
అంతేకాకుండా ఒక స్టార్ హోదాకు చేరుకున్నాడని చెప్పాలి.

ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.సోషల్ మీడియాలో కూడా ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈయన అక్కినేని ఫ్యామిలీతో( Akkineni Family ) బాగా క్లోజ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే.
చాలావరకు వాళ్ళ ఫ్యామిలీలో ఫోటోలో కూడా కనిపిస్తూ ఉంటాడు.అయితే దానికి కారణం ఒకటి ఉందని చెప్పాలి.
అక్కినేని వారి మేనకోడలు యార్లగడ్డ సుప్రియతో( Yarlagadda Supriya ) అడవి శేష్ ప్రేమలో ఉన్నాడని తెలిసింది.ఇప్పటికే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలాసార్లు వైరల్ అయ్యాయి.
ఆ మధ్య క్రిస్మస్ వేడుకలో కూడా వీరిద్దరు పక్క పక్కన కూర్చొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుంది అని అర్థమయింది.

అయితే ఇంతకాలం లవ్ లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది.అంతేకాకుండా వీరిపెళ్లి పెద్దగా నాగచైతన్య బాధ్యతలు తీసుకున్నాడట.దీంతో నాగచైతన్య ఇరువురి ఇంట్లో ఒప్పించి ముహూర్తం కి డేట్ కూడా ఫిక్స్ చేయించాడని.అది కూడా జూన్ 16 అని.ఇక ఆరోజు వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది అన్న వార్త బాగా వైరల్ అవుతుంది.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాగా హాట్ టాపిక్ గా మారింది.







