ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు మృతిచెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.దీనిలో భాగంగా పలువురు డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలతో పాటు రంగారెడ్డి డీహెచ్ఎంఓపై బదిలీ వేటు వేసింది.
అయితే ఈ ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వైద్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.బాధ్యులపై కాకుండా వేరు వాళ్లపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
ఆపరేషన్ థియేటర్ ప్యుమిగేషన్ లో లోపాలు ఉన్నట్లు కమిటీ నివేదిక ఇచ్చింది.కానీ అక్కడ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనకు సంబంధం లేని డాక్టర్లపై, సూపర్ వైజర్లపై చర్యలు తీసుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.