Ranbir Kapoor Raha : ఏడాదిన్నర కూతురుకి కోట్లు విలువైన కానుక ఇచ్చిన రణబీర్ కపూర్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) అలియా భట్ ( Alia Bhatt ) జంట ఒకటి.వీరిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా వీరిద్దరూ ప్రేమలో పడి నిజ జీవితంలో కూడా ఒకటయ్యారు.

 Ranbir Kapoor Gives Costly Gift To His Daughter-TeluguStop.com

ఇలా 2022వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట అదే ఏడాదిలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు తన కుమార్తెకు రాహా( Raha )అనే నామకరణం కూడా చేశారు.

Telugu Alia Bhatt, Gift, Raha Kapoor, Ranbir Kapoor, Ranbirkapoor-Movie

ఇన్ని రోజులు తన కుమార్తెను చూపించకుండా ఎంతో జాగ్రత్త పడినటువంటి ఈ జంట తన కూతురి ఫేస్ రివీల్ చేశారు.అచ్చం తల్లి పోలికలతోనే రాహా ఎంతో క్యూట్ గా ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే.ఇటీవల కాలంలో ఈ జంట ఎక్కడికి వెళ్లిన తమ కూతురిని కూడా వెంట తీసుకు వెళుతూ ఉన్నారు.

ఈ బుల్లి అలియాకి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా రాహాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Alia Bhatt, Gift, Raha Kapoor, Ranbir Kapoor, Ranbirkapoor-Movie

ఏడాదిన్నర వయసు కలిగినటువంటి ఈ చిన్నారి కోసం తన తండ్రి కోట్ల విలువ చేసే కానుక( Costly Gift ) ఇచ్చారని బాలీవుడ్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది.అంత కాస్ట్లీ గిఫ్ట్ రణబీర్ కపూర్ ఏమిచ్చారు అనే విషయానికి వస్తే.ముంబైలో తమ కృష్ణ రాజ్ బంగ్లాని( Krishnaraj Bungalow ) రణ్‌బీర్ తన కూతురి పేరు మీద రాసేశారు.దాని విలువ అక్షరాలా రూ.250 కోట్లు.షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ బంగ్లా కంటే ఈ బంగ్లా ధర ఎక్కువని చెప్పాలి.

ఇలా తన పేరు మీద ఉన్నటువంటి 250 కోట్ల విలువచేసే బంగ్లాను తన కూతురు పేరు మీద రాయడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే రిచ్ కిడ్( Rich Kid ) గా రాహా పేరు సంపాదించుకున్నారు.ఈ బంగ్లాతో పాటు ఈ జంటకు ముంబైలో మరో నాలుగు బంగ్లాలు ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube