మాతృత్వం అనేది ఆడవారికి ఒక వరం.పెళ్లి తర్వాత ఏదో ఒక సమయంలో ప్రతి మహిళ అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడుతుంది.
కోరుకున్నట్లుగానే ప్రెగ్నెంట్( Pregnant ) అయితే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు.పైగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
తమ బిడ్డ హెల్తీగా పుట్టాలని అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రెగ్నెన్సీ సమయంలో చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.
అందులో జలుబు కూడా ఒకటి.గర్భం దాల్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో జలుబు బారిన పెడుతుంటారు.
ఇమ్యూనిటీ పవర్( Immunity Power ) తక్కువగా ఉండటం వల్ల జలుబు ఇబ్బంది పెడుతుంది.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తుంది.

ఈ క్రమంలోనే జలుబు( Cold ) నుంచి బయటపడడం కోసం డాక్టర్ల సలహా తీసుకోకుండా ఎప్పుడు వాడే మందులు వాడుతుంటారు.ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి.నిజానికి జలుబు వల్ల కడుపులో బిడ్డ పై ఎటువంటి ప్రభావం పడదు.కానీ జలుబు తగ్గడానికి మీరు వాడే మందులు చిన్నారుల్లో శారీరక పరమైన లోపాలు ఏర్పడేలా చేస్తాయి.
అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో జలుబు చేస్తే సొంత నిర్ణయాలతో మందులు వాడవద్దు.వీలైనంతవరకు సహజ చిట్కాలతోనే జలుబు నుంచి బయటపడడానికి ప్రయత్నించండి.జలుబును నివారించడానికి నిమ్మరసం ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.నిమ్మరసంలో ఉండే విటమిన్ సి( Vitamin C ) మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబును నివారించడానికి తోడ్పడతాయి.
ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ లో రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ తేనె, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.

అలాగే ప్రెగ్నెన్సీ టైంలో జలుబును తగ్గించడానికి వెల్లుల్లి, తేనె( Honey ) గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.రోజు ఉదయం మరియు సాయంత్రం రెండు వెల్లుల్లి రెబ్బలను తేనెలో( Garlic ) ముంచి తీసుకుంటే జలుబు వేగంగా తగ్గుముఖం పడుతుంది.అదే సమయంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.