యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం రాదేశ్యాం సినిమా తెరకేక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాలు షూటింగ్ ఫినిష్ అయిపోయాయి.ఇంకా కొన్ని మాత్రమే షూట్ చేయాల్సి ఉంది.
ఈ ఏడాది ఆఖరు నాటికి సినిమాని రిలీజ్ చేయాలని భావించారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకుండా ఉంది.
మరల ఎప్పటికి షూటింగ్ లు ప్రారంభం అవుతాయి అనేది అర్ధం కాని విషయం.ఇక లాక్ డౌన్ తొలగింపు తర్వాత షూటింగ్ లు మొదలైతే పారిస్ ఎపిసోడ్ ని అన్నపూర్ణ స్టూడియో షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష్ ఓ నెగిటివ్ రోల్ చేయబోతుంది అనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.పూర్తి స్థాయి విలన్ పాత్ర కాకుండా ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం.
గతంలో ప్రభాస్ తో త్రిష వర్షం, పౌర్ణమి సినిమాలలో ఆడిపాడింది.ఈ నేపధ్యంలో ప్రభాస్ కోసం ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.ఇక త్రిష కూడా ఈ మధ్య కాలంలో నెగిటివ్ రోల్స్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది.ఈ నేపధ్యంలోనే ప్రభాస్ సినిమాకి కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.