మొటిమలన్నీ పోయి ముఖం అందంగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!
TeluguStop.com
మొటిమలు( Acne ) బాగా వేధిస్తున్నాయా..
? ఎంత ప్రయత్నించినా అవి మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా.? మొటిమల కారణంగా ముఖం కాంతిహీనంగా కనిపిస్తుందా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే.
ఈ రెమెడీతో మొటిమలన్నిటినీ దూరం చేసుకోవచ్చు.ముఖాన్ని అందంగా ఆకర్షణీయంగా మెరిపించుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ చూపు చూసేయండి.
"""/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.
దాంతో వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జెల్ ను సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి.
"""/" /
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు టొమాటో ముక్కలు, మూడు శుభ్రంగా పొట్టు తొలగించిన వెల్లుల్లి( Garlic ) రెబ్బలు వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ ప్యూరీలో రెండు స్పూన్లు అవిసె గింజల జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని ప్రయత్నిస్తే ముఖంపై ఎలాంటి మొండి మొటిమలు ఉన్నా సరే పరార్ అవుతాయి.
వాటి తాలూకు మచ్చలు ఉంటే మాయం అవుతాయి.ముఖం అందంగా మారుతుంది.
ఆకర్షణీయంగా మెరుస్తుంది.మొటిమల సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
తరచూ ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు రావడం కూడా క్రమంగా తగ్గుతాయి.కాబట్టి మొటిమల్లేని అందమైన మెరిసే చర్మం కోసం తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.
తమిళ హీరో అజిత్ రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉందా.. ప్రతి నెలా అంత ఇవ్వాల్సిందేనా?