నువ్వులు ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచుతాయి.. ఇలా వాడి చూడండి!

నువ్వులు చూడటానికి చిన్న పరిమాణంలో కనిపించినా ఆరోగ్యానికి మాత్రం అంతులేని ప్రయోజనాలను చేకూరుస్తాయి.రోజుకు ఒక టీ స్పూన్ నువ్వులను( sesame seeds) తినడం వల్ల వివిధ రకాల జబ్బులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు.

 How To Use Sesame Seeds For Spotless And Glowing Skin! Spotless Skin, Glowing Sk-TeluguStop.com

అయితే ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచడానికి కూడా నువ్వులు సహాయపడతాయి.

సాధారణంగా కొందరికి నల్లటి మచ్చలు( Black spots ) ఏర్పడి ముఖం అసహ్యంగా కనిపిస్తుంటుంది.

అయితే అలాంటివారు వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వుల పొడిలో పావు టీ స్పూన్ పసుపు( Turmaric ) మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు( Curd ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.నిత్యం ఈ విధంగా కనుక చేస్తే చర్మంపై ఉన్న మచ్చలన్నీ మాయమవుతాయి.

స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Telugu Tips, Skin, Sesameseeds, Latest, Sesame Seeds, Skin Care, Skin Care Tips-

అలాగే స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేయడంలో నువ్వుల నూనె సహాయపడుతుంది.అందుకోసం అర టీ స్పూన్ నువ్వుల నూనెను ( Sesame oil )ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.స్నానం చేయడానికి గంట ముందు నువ్వుల నూనె అప్లై చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల సాగిన చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.

వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.వయసు పెరిగినా కూడా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

Telugu Tips, Skin, Sesameseeds, Latest, Sesame Seeds, Skin Care, Skin Care Tips-

ఇక ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు మరియు పావు కప్పు పాలు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆపై నువ్వుల‌ను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ క‌ల‌ర్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

పిగ్మెంటేషన్ దూరం అవుతుంది.చర్మ కణాలు లోతుగా సైతం శుభ్రం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube