జొన్నలు( Sorghum ).వీటి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.
చిరుధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి.పురాతన కాలం నుంచి జొన్నలను వాడుతున్నారు.
అయితే కొన్ని దశాబ్దాల నుంచి జొన్నల వాడకం బాగా తగ్గింది.సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు జొన్నలను పట్టించుకోవడం మానేశారు.
నిజానికి జొన్నలు ఎంతో ఆరోగ్యకరమైనవి.వివిధ రకాల పోషకాలకు పవర్ హౌస్ లాంటివి.
జొన్నలతో ఎన్ని జబ్బులకు దూరంగా ఉండవచ్చో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.జొన్నల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల జొన్నలు ధృడమైన కండరాల నిర్మాణానికి మద్దతు ఇస్తాయి.అలాగే ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది.
అతి ఆకలి దూరం అవుతుంది.శరీర బరువు అదుపులోకి వస్తుంది.
బరువు తగ్గాలని భావిస్తున్న వారికి జొన్నలు ఉత్తమమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.
జొన్నల్లో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది.రోజువారీ ఆహారంలో జొన్నలను చేర్చుకుంటే మలబద్ధకం సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. జీర్ణ క్రియ( Digestion ) చురుగ్గా పనిచేస్తుంది.
జొన్నల్లో ఉంటే ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, విటమిన్ బి( Iron, Calcium, Magnesium, Copper, Zinc, Vitamin B ) వంటి పోషకాలు ఎముకల బలహీనతను పోగొడతాయి.బోన్స్ ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.
రక్తహీనత సమస్యకు చెక్ పెడతాయి.రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
అలాగే జొన్నలు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్( bad cholesterol ) స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.జొన్నలు శరీరంలో శక్తి స్థాయిలను పెంపొందించడానికి అద్భుతంగా తోడ్పడతాయి.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.జొన్న ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మధుమేహం వ్యాధికి దూరంగా ఉండవచ్చు.
జొన్నల్లో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్‌గా పని చేస్తాయి.కాబట్టి ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని భావించేవారు తప్పకుండా జొన్నలను ఆహారంలో భాగం చేసుకోండి.
జొన్నలతో రొట్టెలు, ఉప్మా, దోశ, ఇడ్లీ ఇలా రకరకాల ఆహారాలను తయారు చేసుకుని తీసుకోండి.