తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీ చేయబోతున్న బర్రెలక్క( Barrelakka ) సంచలనంగా మారింది.ఆమెకు రోజు రోజుకి ప్రముఖుల మద్దతు పెరుగుతూ ఉంది.
నిన్ననే రాంగోపాల్ వర్మ( Ramgopal Verma ).పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ అని కామెంట్లు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా జేడీ లక్ష్మీనారాయణ( JD Lakshminarayana ) సైతం బర్రెలక్కకి మద్దతు తెలియజేశారు.ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను పక్కకు తప్పించి.బర్రెలక్కకు మద్దతుగా నిలిచి భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని సూచించారు.ఆదివారం మంగళగిరిలో వీజే కాలేజీలో రాజ్యాంగ దినోత్సవంలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తానని ధైర్యంగా ముందుకు రావడం జరిగింది.కాబట్టి అందరూ ఆమెకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.ఇదే సమయంలో తాను సమస్యలపై పోరాడు ప్రజలు తప్పకుండా ఎన్నుకుంటారు అని…బర్రెలక్కకి సూచించినట్లు జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని వృధా చేయొద్దని విద్యార్థులకు తెలియజేశారు.రాజకీయాలలో యువత రావాలని కోరారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే ఎన్నికలలో డబ్బున్న వారికి కాదు.ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సామాన్య యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఇదే సమయంలో బర్రెలక్క కోసం ప్రచారం చేస్తానని జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.