ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.వచ్చే సోమవారమే పోలింగ్ కావడంతో ఈ శనివారం ప్రచారానికి చివరి రోజు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా( Devineni Uma ) గురువారం ఏలూరు జిల్లాలో ( Eluru District ) బుట్టాయిగూడెం మండలం టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా వైసీపీ నాయకులు ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు.
జగన్ ప్రభుత్వంలో( Jagan Govt ) ప్రాజెక్టులు అన్నీ పడకేశాయని విమర్శించారు.ప్రాజెక్టు సమాచారం బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారని ఆరోపించారు.తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్టు ( Polavaram Project ) సందర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
నిర్వాసితులకు 19 లక్షలు ఇస్తామని మాట ఇచ్చి జగన్ తప్పారు అని అన్నారు.నిర్వాసితులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు.5000 కోట్లు మంజూరు అయినా చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని గాలికి వదిలేశారు.రాష్ట్రంలో పలు సమస్యలు పరిష్కరించాకే ఎన్నికలలో ఓటు అడుగుతానని ఆనాడు చెప్పిన జగన్.
ఇప్పుడు అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్న జగన్ ఏ రకంగా ఓటు అడుగుతారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.