విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో రాబోతున్న అద్భుతమైన ప్రేమ కావ్యం ఖుషి ( Khushi ) సినిమా.ఈ సినిమాతో తమ అభిమానులను మెప్పించడానికి రెడీ అయ్యారు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశారు.అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉండగా సమంత ( Samantha ) హెల్త్ సరిగ్గా లేకపోవడంతో షూటింగ్ పూర్తికాలేదు.అయితే ఎట్టకేలకు సమంత ఆరోగ్యం సహకరించడంతో షూటింగ్ లో పాల్గొని ముగించిది.
ఇదంతా పక్కన పెడితే సమంత విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతుంది అంటూ ఇప్పటికే జనాలందరూ చెవులు కోరుక్కుంటున్నారు.

అలాగే సినీ క్రిటిక్ ఉమైర్ సందు ( Umair Sandhu ) కూడా వీళ్ళిద్దరూ రాత్రుల్లు ఒకే బెడ్ రూమ్ లో ఉంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి నేపథ్యంలో ఎప్పటినుండో రష్మిక విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ ఉందని వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ సమంత మధ్యలో ఏదో జరుగుతుంది అంటూ వార్తలు రావడం గమనార్హం. ఐతే ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల సమావేశంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ( Vijay deverakonda ) మీకు సెలబ్రిటీలలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే నాకు సమంత మీద చాలా క్రష్ ఉంది అని చెప్పడంతో వీరి మీద వచ్చే ఎఫైర్ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది.అయితే అందరూ రష్మిక పేరు చెబుతాడని ఊహించారు.
కానీ అనూహ్యంగా సమంత పేరు చెప్పడంతో మరింత అనుమానాలు మొదలయ్యాయి.

అయితే వీరిద్దరి మధ్య ఉండే సీక్రెట్ ఎఫైర్ రష్మిక ( Rashmika ) కి కూడా తెలిసిపోయిందని అందుకే రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండపై కోపంలో మునిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు సమంతతో విజయ్ దేవరకొండ రిలేషన్ ఇలాగే కొనసాగితే రష్మిక మరొకరితో కమిట్ అవుతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ చాలామంది విజయ్ దేవరకొండ రష్మిక అభిమానులు మాత్రం మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి.
మీరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి సమంత (Samantha) పై విజయ్ దేవరకొండకు ఉన్నది నిజమైన ప్రేమా లేదా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తున్నారా అనేది తెలియదు.







