సినీ నటుడు వైసీపీ నేత ఆలీ సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్నారు.శుక్రవారం గుంటూరు జిల్లా పెదకూరపాడులో జరిగిన బస్సు యాత్రలో పాల్గొని బహిరంగ సభలో ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెదకూరపాడులో తన చిన్నతనములో ఒక సినిమా చేసినట్లు గుర్తు చేశారు.ఇదే సమయంలో పెద్దకూరపాడు స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు పై పొగడ్తల వర్షం కురిపించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు లేదని తెలిపారు.
పేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపడానికి వైఎస్ జగన్.ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురావడం జరిగిందని ఆలీ స్పష్టం చేశారు.
తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే వైయస్ జగన్ కూడా ఎంతో మంచి హృదయం కలిగిన నాయకుడని అభివర్ణించారు.15 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో ఓ వ్యక్తికి సంబంధించి చికిత్స విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలవడం జరిగింది.ఆ సమయంలో పరిస్థితి అంతా తెలుసుకుని 5 లక్షల రూపాయలు అప్పట్లోనే ప్రభుత్వం తరఫున అందించారు.అదేవిధంగా తండ్రికి తగ్గ రీతిలో వైఎస్ జగన్ ప్రజలకు మంచి మేలులు చేస్తున్నారని ఆలీ స్పీచ్ ఇచ్చారు.
వైయస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడని తెలిపారు.పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల బాధను తెలుసుకుని వాళ్ళందరికీ ముఖ్యమంత్రిగా జగన్ అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆలీ అన్నారు.