ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా పోటీకి దిగుతున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది.టీడీపీ.
జనసేన.బీజేపీ( TDP BJP Janasena ) మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన( TDP Janasena ) మాత్రమే పొత్తులో ఉన్నాయి.
నేడు బీజేపీ కూడా ఈ కూటమిలో కలవటం సంచలనంగా మారింది.ఏపిలో రాజకీయం 2014 మాదిరి పరిస్థితి నెలకొంది.

కాగా పొత్తులో భాగంగా బీజేపీ జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు చంద్రబాబు( Chandrababu ) కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.మిగిలిన స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారట.అయితే ఈ పొత్తులపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( AP Congress YS Sharmila ) సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )దొంగలేనని ఆమె ఆరోపించారు.అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో… చంద్రబాబు సమాధానం చెప్పా లని నిలదీశారు.
గతంలో ఐదేళ్లు పొత్తు పెట్టుకున్నారని అప్పుడు ఏపీకి ఏమి ఇచ్చారని ప్రశ్నించారు.అప్పుడు ఏమి సాధించారనేది కూడా ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.







