కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!!

ఈ ఏడాది మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో( assembly elections ) కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తెలిసిందే.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

 Bjp Mla's Sensational Comments Karnataka Congress Govt Will Collapse, Bjp Mla B-TeluguStop.com

ప్రధాని మోడీ సైతం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అయినా గాని కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించింది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి( Congress party ) కీలక నేత డీకే శివకుమార్.ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు కీలక ఆరోపణలు చేశారు.

కాగా ఇప్పుడు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్… ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది.వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు 25 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని ఎమ్మెల్యే బసనగౌడ పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి సింగపూర్ లో కుట్ర జరుగుతున్నట్లు.

ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించిన కొద్ది రోజులకే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ అదే తరహా వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube