బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) తెలుగు ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.ఏడో సీజన్ దిశగా అడుగులు పడగా బిగ్ బాస్ షో సీజన్ 7 కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తక్కువ సంఖ్యలో కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీజన్ గత సీజన్ల స్థాయిలో మెప్పించడంలో ఫెయిల్ అవుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున బిగ్ బాస్ షోకు హోస్ట్ లుగా వ్యవహరించగా ఈ ముగ్గురిలో నంబర్ వన్ హోస్ట్ ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) పేరు వినిపిస్తోంది.
బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ ను తారక్ ఫాలో కావడంతో పాటు కంటెస్టెంట్ల విషయంలో కరెక్ట్ గా తారక్ వ్యవహరించారు.హోస్ట్ గా నూటికి నూరు శాతం తారక్ న్యాయం చేశారు.
బిగ్ బాస్ షోకు బెస్ట్ హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలవడం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా బాగానే హోస్ట్ గా మెప్పించింది నాని( Nani ) అని చెప్పాలి.కొన్ని విషయాలకు సంబంధించి విమర్శలు ఎదుర్కొన్నా నాని హోస్టింగ్ కు సైతం ఎంతోమంది ఫిదా కావడంతో పాటు అభిమానులుగా మారిపోయారు.న్యాచురల్ స్టార్ నాని కూడా హోస్ట్ గా ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
అయితే బిగ్ బాస్ షో హోస్ట్ నాగ్ మాత్రం హోస్ట్ గా పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారు.
నాగార్జున( Nagarjuna ) బిగ్ బాస్ షో ఎపిసోడ్స్ ను చూడకుండానే బిగ్ బాస్ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హోస్ట్ చేస్తున్నారు.బిగ్ బాస్ ఎపిసోడ్స్ ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.ఇష్టం లేకుండా నాగ్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ కామెంట్లపై కింగ్ నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.