హుస్నాబాద్ లో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
మళ్లీ కాంగ్రెస్ ను నమ్మితే ప్రజలు ఆగం కావాల్సిందేనని మంత్రి హరీశ్ రావు తెలిపారు.ఆరు గ్యారెంటీల సంగతి ఏంటో కానీ ఆరు నెలలకు ఒకసారి సీఎం మారడం ఖాయమని విమర్శించారు.
కాంగ్రెస్ పుట్టుపూర్వత్రాలు మనకు తెలియదా అని ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు కర్ణాటక ప్రజలు మోసపోయినట్లు మనం మోసపోవద్దని చెప్పారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను నమ్మొద్దన్న ఆయన ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.







