ఈ ఆకులు ఉంటే చాలు.. ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అయిపోతాయి..!

మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ( Lungs )కూడా ముఖ్యమైన అవయవాలు.మన శరీరంలో ఇవి చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి.

 If These Leaves Are Enough.. The Whole Lungs Will Be Clean..!, Ajwain Leaves ,-TeluguStop.com

అందుకే వీటిని మనం ఎప్పుడూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి.కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

అయితే విపరీతమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, న్యూమోనియా, దగ్గు, బ్రాంకైటిస్ లాంటి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు.వీటివలన కలిగే ఇబ్బంది చాలా ఉంటుంది.

ఈ సమస్యలకు మందులు వాడడం వలన అనేక దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

Telugu Ajwain, Asthma, Tips, Lungs, Pneumonia, Stress-Telugu Health

ఇలా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు సహజ సిద్దంగా లభించే వామాకు ను వాడడం వలన మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.వామాకు లో థైమాల్, కార్వకాన్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి.ఊపిరితిత్తుల్లో శ్లేష్మాలు ఎక్కువగా తయారవ్వడానికి కారణమయ్యే హిస్టమిన్స్ ఉత్పత్తిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

అది మాత్రమే కాకుండా వామాకు ను వాడడం వలన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ల కారణంగా తలెత్తే ఇబ్బంది, చికాకు కూడా తగ్గిపోతుంది.ఇక ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారు వామాకును వాడడం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

Telugu Ajwain, Asthma, Tips, Lungs, Pneumonia, Stress-Telugu Health

ఆస్తమా సమస్య( Asthma )లతో బాధపడేవారు వామాకు మొక్కలను ఇంట్లో తప్పకుండా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఈ వామాకును పచ్చడిగా చేసి కూడా తీసుకోవచ్చు.అలాగే నీటిలో ఈ ఆకును మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు.అది మాత్రమే కాకుండా వంటలలో కూడా ఈ వామాకును వాడుకోవచ్చు.అయితే ఏదో ఒక రూపంలో రోజు ఈ వామాకును తీసుకోవడం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube