పవన్ కళ్యాణ్ వారాహి పర్యటన తో అధికార పార్టీ ఉలిక్కిపడుతుంది..గాదె వెంకటేశ్వరరావు

రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రజలతో మమేకమై వారాహిపర్యటన తో అధికార పార్టీ ఉలిక్కిపడుతుంది….ఏలూరు సభలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మాట్లాడితే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు….

 Pawan Kalyan's Visit To Varahi Will Make The Ruling Party Angry..gade Venkatesw-TeluguStop.com

వైసీపీ నేతలు దానిపై ఇంగితజ్ఞానం మరచి మాట్లాడుతున్నారంటే ప్రజలు అర్ధం చేసుకోలేని స్థితిలో లేరని గుర్తు చేశారు.

వైసీపీ పార్టీ( YCP ) అధికారంలోకి రావడం అంటే ఏపీ ప్రజలు చేసుకున్న పాపమే అని స్పష్టం చేశారు… ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధానికి వంగివంగి దండాలు పెట్టి సాలువాలు కప్పటం కాదు….

రాష్ట్ర సమస్యలను మాత్రం చెప్పే దమ్ము ధైర్యం లేదా అని ప్రశ్నించారు….వైసీపీ కార్యకర్తలు అంటే రాష్ట్రంలో గుర్తుకువచ్చేది వలంటేర్లే అని నొక్కివక్కాణించారు….కేంద్రప్రత్యేక నిఘా వర్గాలు లెక్కప్రకారం ఎన్నివేలమంది మహిళలు, బాలికలు మిస్సింగ్ అయ్యారో స్పష్టంగా చెప్పింది నిజం కాదా…రాష్ట్రంలో జరుగుతున్న నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారమే జనసేన అధినేత మాట్లాడిన మాట నిజం కాదా…రాబోయే రోజుల్లో వాలంటర్ వ్యవస్థ మీద జనసేన తప్పకుండా రివ్యూ చేస్తామన్నారు….

మీరు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే….

మంత్రి అంబటి రాంబాబు</em( Ambati rambabu )వాలంటర్ వ్యవస్థ పై మాట్లాడిన మాటలు గుర్తులేదా… వాలంటర్ లకు5వేలు కాదు50వేలు డబ్బులు ఇస్తూ ఇష్టానుసారంగా వ్యవహారం చూస్తుంటే చూస్తూ ప్రజలు కూర్చోవాలా….మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడే మాటలు, నోటీసులు చూస్తుంటే వీరి దుర్మార్గపు చర్యలకు ప్రతిరూపం అని ఎద్దేవాచేశారు… రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉండటమే మహిళలకు దరిద్రంగా తయారైంది… రాష్ట్రంలో మంత్రులు శాఖకు చెందిన వారో వారికే తెలియని పరిస్థితి నెలకొంది… వైసీపీ నేతలు దిష్టిబొమ్మను తగలబెడితే మాకు వుండేదేముందని అన్నారు.

రాష్ట్రంలో వలంటర్స్ చేసిన దుర్మార్గపు పనులకు చర్చలకు వచ్చే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని సవాల్ విసిరారు.జనసేన పార్టీ ( Jana sena party )నేతలు మాట్లాడే మాటలు ఆధారాలతోనే మాట్లాడతారని ఎదుర్కొనే ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube