శోభన్ బాబు ఆ రోజు అలా అనడం తో షాక్ అయ్యాను...

ఒకప్పుడు తెలుగు సినిమా హీరోలు అంటే ఎన్టీయార్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, మురళి మోహన్ లాంటి వారు మాత్రమే హీరోలు గా ఉండేవారు.ఇక వీరిలో శోభన్ బాబు,కృష్ణ స్టార్ హీరోలుగా గా ఎన్టీఆర్ ఏఎన్నార్లకు పోటీగా వారి సినిమాలు నిలిచేవి.

 Geethanjali Comments Viral On Social Media , Shobhan Babu , Jayalalithaa, Geeth-TeluguStop.com

అలాంటి శోభన్ బాబు( Shobhan babu )కి గతంలో ఇండస్ట్రీలో చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు.మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉండేదంటే ఇప్పుడు ఉన్న మహేష్ బాబు కి ఎలా ఉంటుందో అప్పట్లో శోభన్ బాబుకి కూడా అలాగే ఉండేది.

అందుకే గతంలో అందరూ ఆయనను ఇండస్ట్రీలో సోగ్గాడు అని పిలిచేవారు…

 Geethanjali Comments Viral On Social Media , Shobhan Babu , Jayalalithaa, Geeth-TeluguStop.com

మరి అలాంటి శోభన్ బాబు జయలలిత( Jayalalithaa ) ల లవ్ స్టోరీ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపికే.ఇక ఇదంతా పక్కన పెడితే జయలలిత కాకుండా శోభన్ బాబు మరో హీరోయిన్ కి అందరి ముందే తాళి కడతానని బెదిరించారట.

మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.శోభన్ బాబు చాలామంది హీరోయిన్లతో జతకట్టారు.

అందులో గీతాంజలి( Geethanjali ) ఒకరు.గతంలో గీతాంజలి అందం ఎలా ఉండేదంటే ఇప్పుడు శ్రీ లీల ఎలా అయితే స్టార్ హీరోలందరి సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుందో అప్పట్లో గీతాంజలిని కూడా చాలామంది తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపించే వారట…/br>

Telugu Geethanjali, Jayalalithaa, Kollywood, Shobhan Babu, Tollywood-Movie

ఇక ఆమె అందానికి చాలామంది స్టార్ హీరోలు కూడా ఆమె వెంట తిరిగేవారట.అలాంటి వారిలో హరనాథ్, శోభన్ బాబు కూడా ఉన్నారట.అయితే ఓ ఇంటర్వ్యూలో గీతాంజలి మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయం బయట పెట్టింది.

నేను శోభన్ బాబు ఓ సినిమాలో నటిస్తున్న టైంలో ఓ రోజు మా నాన్న షూటింగ్ కి వచ్చారు.అదే టైంలో మా నాన్న ముందే శోభన్ బాబు నా దగ్గరికి వచ్చి ఈరోజు నీకు అందరూ చూస్తుండగానే తాళి కడతాను నన్ను ఎవరు ఆపుతారో చూస్తా అంటూ బెదిరించారు.

దానికి మా నాన్న నేను ఇద్దరం ఆశ్చర్యంలో మునిగిపోయాం./br>

Telugu Geethanjali, Jayalalithaa, Kollywood, Shobhan Babu, Tollywood-Movie

ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటే,మా నాన్న ఏమో పెళ్లి అయినా శోభన్ బాబు నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటానంటున్నారు అని షాక్ లో మునిగిపోయారు.కానీ అప్పుడే అసలు విషయం బయటపడింది అదేంటంటే.ఆరోజు షూటింగ్లో భాగంగా ఆ సన్నివేశం ఉంది.

కానీ శోభన్ బాబు ఆ సన్నివేశానికి సంబంధించిన స్క్రిప్ట్ ముందుగానే చదువుకున్నారు.కానీ ఆ విషయం నాకు తెలియదు.

దాంతో మేమందరం షాక్ అయ్యాం.తర్వాత ఈ విషయం తెలిసి అందరం నవ్వుకున్నాం.

అంటూ గీతాంజలి గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది…ఇక ఆ తరం హీరోల్లో అందరి హీరోలకి సంభందించిన వారసులు ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ శోభన్ బాబు వరసలు మాత్రం ఇండస్ట్రీ కి రాలేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube