అక్కినేని నాగచైతన్య ( Akkineni Naga Chaithanya ) అందరికీ భారీ షాక్ ఇచ్చాడు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.ఇండస్ట్రీలో ఉండే కొంతమంది నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం చేయడంతో నెట్టింట్లో ఒక్కసారిగా నాగచైతన్య పెళ్లి వార్తలు జోరందుకున్నాయి.
ఇప్పటికే పలుమార్లు నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు వినిపించినప్పటికీ అది నిజం కాలేదు.కానీ ఈసారి మాత్రం నాగార్జున ( Nagarjuna ) అందరికీ పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడని, సైలెంట్ గా నాగచైతన్య రెండో పెళ్లి పనులు స్టార్ట్ చేశాడు అంటూ నాగార్జున సన్నిహితులు ఈ విషయాన్ని బయటకి చెప్పడంతో అసలు విషయం బయటపడింది అంటూ ఫిలింనగర్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది.
ఇక నాగచైతన్య రెండో పెళ్లి( Naga Chaitanya Second Marriage ) అనే వార్తలు వినగానే అందరు టక్కున శోభిత ధూళిపాల ( Sobhita dhulipala ) నే కావచ్చు అని అనుకుంటున్నారు.కానీ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోయేది మాత్రం శోభిత ధూళిపాలని కాదు అని తెలుస్తోంది.అయితే శోభితని నాగార్జున తన కోడలుగా చేసుకోక పోవడానికి ఒక కారణం ఉందట.ఎందుకంటే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన సమంతని పెళ్లి చేసుకొని తమ ఫ్యామిలీ ఇబ్బందుల పాలైంది. మరోసారి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకొని లేని గొడవలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని నాగార్జున భావిస్తున్నట్టు తెలుస్తుంది.అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉండే అమ్మాయిని తన కొడుకు ఇచ్చి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారట.
అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటంటే.
ఆమె ఒక బిజినెస్ మాన్ కుటుంబానికి( Businessman Family ) చెందిన అమ్మాయట.అలాగే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నాగార్జున ఫ్యామిలీకి దగ్గరి బంధువులు కావడంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నవంబర్ లో లేదా డిసెంబర్ లో నాగచైతన్య ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటారని సమాచారం.మరి నాగచైతన్య రెండో పెళ్లి వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది బయటపడాలంటే కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సిందే.