శభాష్ చంద్రబాబు : బోటులో పర్యటనలు .. తెల్లవారుజాము సమీక్షలు

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు( Heavy rains ) కురుస్తుండడం,  మళ్ళీ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని , ఆ ప్రభావంతో మరింతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జనాలు మరింత భయాందోళన చెందుతున్నారు.ఇప్పటికే విజయవాడ నగరం మొత్తం జలమయం అయింది.

 Cm Chandrababu Boat Trips Early Morning Reviews , Chandrababu, Ap Cm Chandrabab-TeluguStop.com

ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పొంగిపొర్లుతోంది.  చుట్టుపక్కల వాగులు సైతం పొంగి ప్రవహిస్తూ ఉండడంతో భారీగా వరద నీరు విజయవాడ ను ముంచేస్తుంది.

ముఖ్యంగా బుడమేరు వాగు తీవ్ర రూపం దాల్చడంతో ఈ పరిస్థితి ఏర్పడింది .దీనికి తోడు ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం,  నాగార్జునసాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తి కిందికి నీటిని అధికారులు వదిలేస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ పైన ఆ ప్రభావం పడింది.

Telugu Ap, Ap Effect, Chandrababu-Politics

ఇన్ ఫ్లో తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రెండో ప్రమాద హెచ్చరికను కూడా చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ( Prakasam Barrage ) వద్ద ఇన్ ఫ్లౌ 11, 25,876 క్యూసెక్కులుగా నమోదయింది .వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగానే కిందికి అధికారులు విడుదల చేస్తున్నారు.ఇక ఎప్పటికప్పుడు వరద పరిస్థితులు టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.

నిన్న విజయవాడలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు బోటులో పర్యటించి వరద ప్రభావాన్ని స్వయంగా తెలుసుకున్నారు .ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి అక్కడి బాధితులతో మాట్లాడి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని,  ప్రజల భయపడవద్దని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.  రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చంద్రబాబు( AP cm chandrababu ) బస చేశారు.అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు.

Telugu Ap, Ap Effect, Chandrababu-Politics

 వరద ప్రభావం తగ్గే వరకు ఇక్కడే ఉంటానని స్వయంగా సహాయక పునరావస చర్యలను పర్యవేక్షిస్తానని చంద్రబాబు తెలిపారు.ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు మళ్ళీ అధికారులతో సమీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు.వరద పరిస్థితి, ముంపు ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం , పునరావస కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి వాటిపైన చంద్రబాబు అధికారులతో సమీక్షించి అనేక సూచనలు చేశారు.

తన వయసును కూడా లెక్క చేయకుండా , చంద్రబాబు పెద్దగా విశ్రాంతి లేకుండానే వరద పరిస్థితిలను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వయసులోనూ చంద్రబాబు ఇంత యాక్టివ్ గా ఉండడం , ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న తీరును పార్టీలకు అతీతంగా పలువురు ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube