Anchor Vidhya : ఈ జీరో సైజు ఫిగర్ ఎవరో తెలిస్తే మీ కళ్ళను మీరే నమ్మరు !

మీ కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా ? జీరో సైజు ఫిగర్ తో హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ హాట్ ఫోటో షూట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా ? అచ్చం అలాగే ఉంది అయితే మీరు అలాగే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే మీ ముందు ఉన్న ఈ పిక్ లో అమ్మాయి హీరోయిన్ కావడం కోసం కుస్తీలు పట్టి జీరో సైజు వచ్చిన అమ్మాయి కాదు.

 Aata Srividya Then And Now, Anchor Vidhya , Director Vakkantham Vamsi, Tollywood-TeluguStop.com

ఇద్దరు పిల్లల తల్లి.అవాక్కయ్యారా ? అవకుండా ఎలా ఉంటారు.ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో చాల మంది హెల్త్ కాన్షియస్ అవుతున్నారు.ఎన్నేళ్లు వచ్చిన అందం కాపాడుకుంటూ అచ్చం కుర్ర హీరోయిన్స్ లాగ కనిపిస్తున్నారు.

హీరోయిన్స్ కి పోటీగా ఉంటున్నారు అనుకున్న తప్పు లేదు.ఇక అసలు విషయం లోకి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముద్దు గుమ్మ ఒకప్పటి బొద్దు గుమ్మ అయినా యాంకర్ విద్య.

అదేనండి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ అల్లు అర్జున్ తో సినిమా తీసిన దర్శకుడు వక్కంతం వంశి భార్య.యాంకరింగ్ లో కొన్నేళ్ల పాటు చక్రం తిప్పి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సైలెంట్ గా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది.

ఇక అప్పట్లో బాగా పాపులర్ అయినా ఆట ప్రోగ్రాం లో డ్యాన్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది;.ఆమెను చాల మంది ఆట శ్రీవిద్య అంటే మాత్రమే గుర్తు పడతారు.

Telugu Aata Srividya, Anchor, Anchor Vidhya, Tollywood-Telugu Stop Exclusive Top

ఇక శ్రీవిద్య కు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు అయినా కూడా అప్పట్లో ఎంతో బొద్దుగా ఉండే శ్రీవిద్య బాగా ఫిజిక్ మైంటైన్ చేస్తూ డైలీ వర్క్ ఔట్స్ చేస్తూ సన్నజాజి తీగల మారిపాయింది.అప్పటి ఫోటోలకు ఇప్పటి గెటప్ కి అస్సలు సంబంధం లేదు అంటే నమ్మండి.ఇక శ్రీవిద్య సోషల్ మీడియా లో మాత్రం ఆమె అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.తన డైలీ లైఫ్ ని పిక్స్ తో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

శ్రీవిద్య మళ్లి తెర పై కనిపిస్తే చూడాలని అందరు అనుకుంటున్నారు.పైగా ఆమె ఇప్పుడు చాల అందంగా కూడా ఉంది.

ఇక వక్కంతం వంశి మొదట్లో నటుడిగా ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ గా ఇప్పుడు డైరెక్టర్ గా మారాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube