ధర్మ చక్రం సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యి దేవి సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ ప్రేమ.ఈమె హీరోయిన్ గా తక్కువ సమయంలోనే మంచి సినిమాల్లో నటించింది.
కానీ ఈమె నటించిన చిరునవ్వుతో సినిమా కెరీర్ ను పూర్తిగా మార్చేసింది.అప్పటి వరకు మంచి సినిమాల్లో నటిస్తూ ఉన్న ప్రేమ కు త్రివిక్రమ్ చిరునవ్వు తో సినిమా ఆఫర్ చేశాడట.
ఆ సినిమా కథ చెప్పిన సమయంలో చిరు నవ్వుతో సినిమా లో సెకండ్ హీరోయిన్ పాత్ర అన్నట్లుగా చెప్పారట.కానీ తీరా సినిమా విడుదల అయ్యాక చూస్తే సెకండ్ హీరోయిన్ కాదు కదా అదో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.
అంతే కాకుండా ఆ పాత్ర వల్ల ఇమేజ్ బాగా డ్యామేజీ అయ్యింది.చిరు నవ్వుతో సినిమా తర్వాత మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది.
నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అంటూ నన్ను త్రివిక్రమ్ ఒప్పించాడు.కానీ కథ లో నా పాత్రను మరో విధంగా చెప్పి చిత్రీకరించే సమయంలో మరో రకంగా చిత్రీకరించి నన్ను త్రివిక్రమ్ మోసం చేశాడు అంటూ ఆరోపించింది.

చిరునవ్వుతో సినిమాకు రచయితగా త్రివిక్రమ్ వ్యవహరించాడు.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి ప్రేమ కెరీర్ పూర్తిగా కల్లాస్ అయ్యింది.అప్పటి నుండి వచ్చే అవకాశం పోయే అవకాశం అన్నట్లుగా చేస్తూ వస్తోంది.ఈ మధ్య రీ ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తోంది.అందంగా కనిపిస్తూ ఉన్న ప్రేమ సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మగా అక్కగా అత్తగా చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న కొన్ని సినిమాల్లో నటిస్తోంది.
ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ ప్రేమ తన కెరీర్ నాశనం అవ్వడానికి కారణం త్రివిక్రమ్ అంటూ మరోసారి వ్యాఖ్యలు చేసింది.గతంలోనే త్రివిక్రమ్ పై ఈమె విమర్శలు చేసింది.
ఇప్పుడు మరింతగా రెచ్చి పోయింది.మరి ఇందుకు త్రివిక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.







