ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.43
సూర్యాస్తమయం: సాయంత్రం.6.20
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.8.55 ల9.55
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:
ఈరోజు ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి.వృత్తి, వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఇతరులకు ధన సహాయం అందిస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం:
ఈరోజు సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు.సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తిచేసి అధికారుల ఆదరణ పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మిథునం:
ఈరోజు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం:
ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి.ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి.
ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.
సింహం:
ఈరోజు బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది.సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
కన్య:
ఈరోజు ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.స్ధిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.
ఆర్థికంగా సమస్యలు తప్పవు.కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు.ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.
తుల:
ఈరోజు వ్యాపారాలలో ఆశించిన అభివృద్ది సాధిస్తారు.నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు.బంధుమిత్రులతో కలసి విహారయాత్రలలో పాల్గొంటారు.
సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.దైవ సేవా కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు.
వృశ్చికం:
ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.స్థిరస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఉద్యోగాలలో స్థానచలనాలు తప్పవు.
కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్ధిక సహాయం పొందుతారు.
ధనుస్సు:
ఈరోజు వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది.చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.
మకరం:
ఈరోజు గృహమున సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.
కుంభం:
ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.పాత ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు.
మీనం:
ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి.
ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు.