ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడితే ఊడిన జుట్టు మొత్తం తిరిగి వస్తుంది!

సాధారణంగా కొందరిలో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.కానీ మళ్ళీ కొత్త జుట్టు రాదు.

 Use This Magical Oil To Regrow All Your Lost Hair! Hair Oil, Hair Growth Oil, A-TeluguStop.com

ఇందుకు కారణం హెయిర్ గ్రోత్ లేకపోవడం.దీని వల్ల కొద్ది రోజుల్లోనే ఒత్తుగా ఉండాల్సిన జుట్టు పలుచగా తయారవుతుంది.

దాంతో టెన్షన్ మొదలవుతుంది.ఏం జరుగుతుందో తెలియక.

జుట్టు ఎందుకు మళ్లీ రావడం లేదో అర్థం గాక తీవ్రంగా మదన పడుతూ ఉంటారు.ఇలా టెన్షన్ పడటం వల్ల జుట్టు మరింత అధికంగా ఊడుతుంది.

కాబట్టి ముందు ఒత్తిడిని తగ్గించుకోండి.ఆపై ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను వాడటం ప్రారంభించండి.

Telugu Care, Care Tips, Fall, Oil, Latest, Thick-Telugu Health Tips

ఈ ఆయిల్ ను వాడితే మీ ఊడిన జుట్టు మొత్తం కొద్ది రోజుల్లోనే మళ్లీ వస్తుంది.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( kalonji seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు, ఆరు బాదం ప‌ప్పు( Almonds ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు మందారం ఆకులు, ఒక మందారం పువ్వు( Hibiscus ), మూడు రెబ్బలు కరివేపాకు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Latest, Thick-Telugu Health Tips

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ తో పాటు పేస్ట్ ను కూడా వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Latest, Thick-Telugu Health Tips

ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.ఊడిన జుట్టు మొత్తం మళ్లీ తిరిగి వస్తుంది.

అదే సమయంలో హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

తెల్ల జుట్టు త్వరగా దరిచేరకుండా ఉంటుంది.కురులు స్మూత్ అండ్ షైనీ గా సైతం మెరుస్తాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube