వినడానికి విడ్డూరంగా వున్నా మీరు విన్నది నిజమే.గట్టిగా దగ్గడం వలన ఓ అమ్మాయి తన పక్కటెముకలు విరగగొట్టుకుంది.
సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి వింతలూ విశేషాలు ఎక్కడ జరిగినా ఇట్టే తెలిసిపోతుంది.ప్రపంచమే కుగ్రామం అయినపుడు ఇలాంటి విషయాలు గ్రహించడం తేలికే.
అయితే ఇలాంటివి కూడా జరుగుతాయా? అనే ఆశ్చర్యం కలిగినపుడు స్థాణువులా ఉండిపోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది.తాజాగా అలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది.
బేసిగ్గా ప్రతీ మనిషి ఏదో ఒక సందర్భంలో తుమ్మడం, దగ్గడం వంటి పనులు చేస్తుంటాడు, అది నిత్య కృత్యం.ఇక కరోనా కష్టకాలంలో అయితే దగ్గు తుమ్ము వస్తే మాత్రం పక్కనున్నవారు భయాందోళనలకు గురయ్యేవారు కానీ అలాంటివి సర్వసాధారణం అనే విషయం అందరికీ విదితమే.
అయితే సాధారణంగా జలుబు చేసినప్పుడు లేదా ఏదైనా దుమ్ము ముక్కులోనుండి వెళ్లి గొంతులోకి చేరినప్పుడు దగ్గు తుమ్ము లాంటివి రావడం సహజమే.అలా దగ్గు వచ్చినప్పుడు వాటర్ తాగితే కంట్రోల్ అయిపోతుంది.
కానీ కేవలం దగ్గడం కారణంగా ప్రాణాలకే ప్రమాదం అంటే దానంత దురదృష్టకరం ఇంకేమి ఉండదు.
అవును… అసలు విషయంలోకి వెళితే, దగ్గడం కారణంగా ఏకంగా ఒక యువతి పక్కటెముకలు విరిగిపోయాయి.చైనాలో ఉండే హువాంగ్ అనే యువతికి బాగా ఆకలివేయడంతో స్పైసీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నది.ఈ క్రమంలో బాగా దగ్గు రావడంతో గట్టిగా దగ్గింది.
కొంత సమయం తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో దగ్గరలో వున్న హాస్పిటల్ కి వెళ్ళింది.వైద్యులు పరీక్షలు చేసి చూడడంతో నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు.
దానికి కారణం ఆమె తక్కువ బరువు అని తేల్చి చెప్పారు వైద్యులు.అందువలన ఎముకలకు మజిల్ సపోర్ట్ అనేది లేకుండా పోయిండట.
దాంతో దగ్గినా వెంటనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు.