కార్తీకదీపం సీక్వెల్( Karthika Deepam Sequel ) ఈరోజు రాత్రి నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.కార్తీకదీపం ఏ స్థాయిలో హిట్ అయిందో కార్తీకదీపం 2 అదే స్థాయిలో హిట్ అవుతుందని ఈ సీరియల్ మేకర్స్ భావిస్తున్నారు.
అయితే కార్తీకదీపంలో ఉన్న మోనిత పాత్ర( Monitha ) కార్తీకదీపం సీక్వెల్ లో లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.శోభాశెట్టి( Shobha Shetty ) తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సీరియల్ కోసం నాకు కాల్ రాలేదని వెల్లడించారు.
అయితే కార్తీకదీపం సీక్వెల్ లో శోభాశెట్టికి బదులుగా మరో కొత్త అమ్మాయి నటిస్తున్నారని తెలుస్తోంది.కార్తీకదీపం ఇది నవ వసంతం( Karthika Deepam Idi Nava Vasantham ) పేరుతో సీక్వెల్ ప్రసారమవుతోంది.
కార్తీక దీపం సీక్వెల్ లో నటిస్తున్న ఈ అమ్మాయి పేరు గాయత్రి సింహాద్రి( Gayathri Simhadri ) కాగా గతంలో ఈమె యాంకర్ గా పని చేశారు.రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది.
కార్తీకదీపం సీక్వెల్ ఫస్ట్ పార్ట్ ను మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
స్టార్ మా ఛానెల్ లో కార్తీకదీపం నంబర్ వన్ సీరియల్ గా నిలవగా కంటెంట్ కొత్తగా ఉంటే మాత్రం కార్తీకదీపం సీక్వెల్ సైతం ఆడియన్స్ ను మెప్పించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.కార్తీకదీపం సీక్వెల్ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా భారీ బడ్జెట్ ఈ సీరియల్ కోసం కేటాయించారని తెలుస్తోంది.ఈ సీరియల్ లో గాయత్రి సింహాద్రి పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
అయితే శోభాశెట్టి స్థాయిలో న్యాయం చేయడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈరోజు వేర్వేరు ఛానెళ్లలో కూడా మరికొన్ని సీరియళ్లు మొదలు కానున్నాయని సమాచారం అందుతోంది.కార్తీకదీపం సీరియల్ లోని ప్రధాన పాత్రలకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.కార్తీకదీపం సీరియల్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.