ఈ చిట్కాను పాటిస్తే హెయిర్ ఫాల్ మ‌రియు చుండ్రుకు బై బై చెప్పొచ్చు!

హెయిర్ ఫాల్‌, చుండ్రు.జుట్టు స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధానంగా వేధించే వాటిలో ఈ రెండే ముందు ఉంటాయి.

 Following This Tip Will Reduce Hair Fall And Dandruff , Hair Fall, Dandruff, Sim-TeluguStop.com

స్త్రీలే కాదు పురుషులు సైతం ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో తీవ్రంగా మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే హెయిర్ ఫాల్‌, చుండ్రు స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తుంటారు.

ఖ‌రీదైన హెయిర్ ఆయిల్స్‌, షాంపూలు, సీర‌మ్స్ వాడుతుంటారు.ర‌క‌రకాల హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.

అయినప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ట్రీట్‌మెంట్స్ వ‌ర‌కు వెళ్తారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ చిట్కాను పాటిస్తే ఆ అవ‌స‌రం మీకు అక్క‌ర్లేదు.

స‌హ‌జంగానే హెయిర్ ఫాల్ మ‌రియు చుండ్రు స‌మ‌స్య‌ల‌కు బై బై చెప్పొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక మీడియం సైజ్ అల్లం ముక్క‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.ఈ తురుము నుండి ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో అల్లం జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

Telugu Dandruff, Care, Care Tips, Fall, Latest, Long, Simple Tips-Telugu Health

అలాగే ఒక క‌ల‌బంద ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి.లోప‌ల ఉండే జెల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల క‌ల‌బంద జెల్‌, నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

Telugu Dandruff, Care, Care Tips, Fall, Latest, Long, Simple Tips-Telugu Health

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని.ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ చిట్కాను ఫాలో అయితే హెయిర్ ఫాల్ క్ర‌మంగా త‌గ్గుతుంది.అదే స‌మ‌యంలో చుండ్రు స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం సైతం ల‌భిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube