కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు యశ్ ఒకరు.ఈయన కే జి ఎఫ్ సినిమా ద్వారా ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమాతో ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ లభించింది.
ఈ విధంగా యశ్ పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎన్నో కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయడం కోసం ఈయన వెంటపడ్డారు.

సాధారణంగా ఇలాంటి క్రేజ్ ఉన్న హీరోలకి భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి తమ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటారు.అయితే ఇప్పటికే ఈయన ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈయన మరొక బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న పెప్సీ కూల్ డ్రింక్ కి యశ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని యశ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.యశ్ పెప్సీ తాగుతూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… అభినందనలు పెప్సీ… నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఈయన చెప్పకోచ్చారు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో అభిమానులు ఇకపై పెప్సీ బ్రాండ్ కూడా పెరిగిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదే కాకుండా ఇదివరకు ఈయనకు పాన్ మసాలా ప్రకటనలో నటించడానికి కూడా ఆఫర్ రావడంతో ఇలాంటివి ఆరోగ్యానికి హానికరం అని భావించిన యశ్ ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారు.







