హీరోయిజం బయట పడాలి అంటే విలన్ పవర్ ఫుల్ గా ఉండాలి.ఇదే కీ పాయింట్‌ను ఆసరాగా చేసుకుని హీరోకు తగిన విలన్ క్యారెక్టర్లు రూపొందిస్తారు రాజమౌళి, బోయపాటి.
ఈ విషయంలో వారు పుల్ సక్సెస్ అయ్యారు.ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ లకు మంచి డిమాండ్ ఉంది.
వీరికి రెమ్యునరేషన్ కూడా బాగానే వస్తుంది.టాలీవుడ్ లో టాప్ విలన్స్ ఎవరు? వారి రెమ్యునరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం!
ప్రకాష్ రాజ్
అంతపురం సినిమాలో తన నటనతో ప్రకాష్ రాజ్ విలన్ గా ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు.అప్పటి నుంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.విలన్ క్యారెక్టర్ కు సినిమాకు కోటి యాభై లక్షలు తీసుకుంటాడు ప్రకాష్ రాజ్.సపోర్టింగ్ క్యారెక్టర్ కు రోజుకు పదిలక్షల వరకు తీసుకుంటాడని సమాచారం.
సోను సూద్
భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా విలన్ గా సెట్ అవుతాడు సోనూసూద్.అరుంధతి సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా హైలెట్ అయ్యాడు.సోను సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకుంటున్నాడట.
సంపత్ రాజ్
మిర్చి సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్.టాలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తున్నాడు.ఒక్కో సినిమాకు 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు.
సాయి కుమార్
ఎవడు సినిమాలో మొదటిసారి విలన్ పాత్రలో కనిపించి వారెవ్వా అనిపించాడు సాయి కుమార్.విలన్ క్యారెక్టర్ అయినా.సపోర్టింగ్ రోల్స్ అయినా సినిమాకు 50 లక్షలు తీసుకుంటున్నాడట.
సుదీప్
ఈగ సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు సుదీప్. దబాంగ్ -3 లో కూడా విలన్ గా చేసాడు .ఈయన రెమ్యునరేషన్ సినిమాకు 3 కోట్లు.
ఆది పినిశెట్టి
హీరో ఆది పినిశెట్టి.విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు.ఒక్కో సినిమాకు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
జగపతి బాబు
హీరోగా కంటే విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు.ఈయన సినిమాకు 2 కోట్లకుపైగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
హరీష్ ఉత్తమన్
కోలీవుడ్ లో చాలా సినిమాల్లో విలన్ గా చేస్తున్నాడు హరీష్.ఈయన రెమ్యునరేషన్ 50 లక్షలు.
వివేక్ ఒబేరాయ్
రామ్ చరణ్ మూవీ వినేయ విధేయ రామలో మెయిన్ విలన్ గా చేశాడు వివేక్ ఒబేరాయ్.ఆయన రెమ్యునరేషన్ 3 కోట్ల రపాయలు.
రవి కిషన్
రేసుగుర్రం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు రవి కిషన్.సైరాలో కూడా నటించాడు.ఈయన సినిమాకు 50 లక్షలు తీసుకుంటాడు.
.