Dry Eyes : కళ్ళు తరచూ పొడిబారి దురద పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

లాప్‌టాప్ ముందు గంటలు తరబడి పని చేసేవారు, అతిగా ఫోన్, టీవీ చూసేవారు చాలా కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో కళ్ళు పొడిబారిపోవడం( Dry Eyes ) ఒకటి.కన్నీటి ఉత్పత్తి తగినంతగా లేనప్పుడు లేదా కన్నీళ్లు చాలా త్వరగా ఆవిరైపోయినప్పుడు కళ్లు పొడిబారుతుంటాయి.

 Simple Tips To Get Rid Of Dry And Itchy Eyes Naturally-TeluguStop.com

హార్మోన్ ఛేంజ్‌, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, పర్యావరణ కారకాల, అతిగా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని ఉండ‌టం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల‌ కూడా కన్నీటి ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది.ఇది కళ్ళు పొడిబారడానికి దారితీస్తుంది.

ఫలితంగా దురద, చిరాకు, అసౌకర్యమైన అనుభూతి, కళ్ళు మంట పుట్టడం, ఎర్ర బడటం తదితర సమస్యలు తలెత్తుతాయి.ఈ నేపథ్యంలోనే పొడి బారిన కళ్ళను ఇంట్లోనే సింపుల్ టిప్స్ తో ఎలా నివారించుకోవచ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆముదం పొడిబారిన కళ్ళకు చక్కని ఔషధంలా పనిచేస్తుంది.చేతివేళ్ల తో కొంచెం ఆముదాన్ని తీసుకుని కనురెప్పలపై అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రోజు నైట్ ఈ విధంగా కనుక చేస్తే కళ్ళు పొడిబారడం అన్న సమస్య ఉండదు.ఆముదం కళ్లలో తేమను నిలుపుకోవడంలో సహాయపడే మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది.

Telugu Oil, Dry Itchy Eyes, Dry Eyes, Eye Care, Tips, Healthy Eyes, Itchy Eyes,

పైగా ఆముదం నూనె( Castor Oil )లో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.ఇవి పొడి కంటి లక్షణాలను తగ్గించడానికి మరియు మొత్తం కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి దోహదం చేస్తాయి.అలాగే కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళు పొడిబారిపోతాయి.కాబట్టి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి.రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రించడానికి కేటాయించండి.క‌ళ్ళు పొడిగా మార‌డానికి డీహైడ్రేషన్( Dehydration ) ఒక కారణం.

అందువల్ల శరీరానికి అవసరమయ్యే నీటిని అందించండి.కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూసులు వంటివి కూడా డైట్ లో చేర్చుకోండి.

Telugu Oil, Dry Itchy Eyes, Dry Eyes, Eye Care, Tips, Healthy Eyes, Itchy Eyes,

తరచూ కళ్ళు పొడిబారి దురద పెడుతున్నాయంటే కచ్చితంగా మీరు ఆల్కహాల్ మరియు సిగరెట్ల కు దూరంగా ఉండాలి.లేదంటే మీ కళ్ళు మరింత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.కంప్యూటర్లు ముందు పని చేసేటప్పుడు రిఫ్లెక్టివ్ కళ్ళద్దాలు వాడడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.త‌ద్వారా క‌ళ్ళు పొడిబారే స‌మ‌స్య త‌గ్గుతుంది.ఇక‌ కంటి ఆరోగ్యం కోసం విటమిన్ బి, విట‌మిన్ ఎ, విటమిన్ డి వంటి పోషకాలు మెండుగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube