మాస్ మహా రాజా రవితేజ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే సినిమాలు చేస్తూ దూసుకు పోతాడు.ప్రెజెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా నెక్స్ట్ మంత్ డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు.ఇక ఇది రిలీజ్ కు రెడీగా ఉంచి ఆయన నెక్స్ట్ సినిమాలపై ద్రుష్టి పెట్టాడు.
అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర సినిమా ఇంకా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుపు కుంటున్నాయి.అలాగే రవితేజ చిరుతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఇలా ఇన్ని సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు రవితేజ.

ఇటీవలే సినిమాటోగ్రాఫర్ ఘట్టమనేని కార్తీక్ కు కూడా రవితేజ ఓకే చెప్పినట్టు టాక్.అలా టాక్ రాగానే ఇలా షూట్ కూడా స్టార్ట్ చేసారు.ఈ సినిమా ప్రెజెంట్ పోలాండ్ లో షూటింగ్ జరుపు కుంటుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.స్టైలిష్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఇద్దరు యంగ్ ముద్దుగుమ్మలను ఫిక్స్ చేసినట్టు టాక్ వస్తుంది.
ఈ సినిమాకు గాను మేకర్స్ రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ తో పాటు ఏక్ మినీ కథ ఫేమ్ కావ్య థాపర్ ను సెలెక్ట్ చేశారట.ఈ యంగ్ బ్యూటీలతో రవితేజ ఈసారి రొమాన్స్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.
రవితేజ వరుస సినిమాలు ప్లాప్ అవుతున్న ఈయనకు మాత్రం దర్శకులు, నిర్మాతలు పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు.అలాగే ముద్దుగుమ్మలు కూడా ఈయనకు వెనుకాడకుండా ఓకే చెబుతున్నారు.
ఇది మరి మాస్ రాజా స్టామినా.







