తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్టీ రామారావుకి ఎంత గొప్ప పేరుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, సూపర్ హిట్స్ అయ్యాయి.
అప్పట్లో రామారావుకి ఉన్న క్రేజ్ ఏ హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు.ఎన్.టి.ఆర్ సినిమాలు విడుదలైన మొదటి రోజు ఉదయం పూటే థియేటర్ల ముందు వేల మంది ప్రజలు క్యూ కట్టేవారు.టికెట్టు దొరకకపోతే రాత్రి వరకు వేచి చూసేవారు.సినిమా చూసి హాయిగా ఎంజాయ్ చేసిన తర్వాతనే ఇంటికి తిరుగు మొహం పట్టే వారు.అయితే 1960 లో జంపనా దర్శకత్వం లో “కాడెద్దులు ఎకరం నేల” అనే సినిమా విడుదలయింది.పొన్నలూరు బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మించిన ఈ మూవీలో ఎన్.
టి.రామారావు, షావుకారు జానకి హీరో హీరోయిన్స్ గా నటించారు.ప్రముఖ కమెడియన్ రేలంగి నరసింహారావు ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు.
అయితే ఈ సినిమా పై ఎన్నో అంచనాలతో ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు తరలి వచ్చారు కానీ ఆ సినిమా తొలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
దీనితో ఎంతో ఆశతో వచ్చిన నందమూరి అభిమానులుంతా తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.ఈ సినిమాలో ఎన్టీరామారావు పేద రైతు పాత్రలో నటించారు.అయితే ఈ మూవీలో వినోదం లేకపోగా రక్తికట్టించే సన్నివేశాలు ఒక్కటి కూడా లేవు.ఆద్యంతం చాలా బోరింగ్ గా నడిచే ఈ సినిమా ప్రేక్షకులను బాగా బాధ పెట్టింది.
నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ ఫుల్ క్రేజ్ లో ఉన్నారు.ఆయన తీసిన సినిమాలన్నీ కూడా వరుసగా సూపర్ హిట్ అవుతున్నాయి కానీ ఆ సమయంలోనే కాడెద్దులు ఎకరం నేల పేరిట ఓ నాసిరకం సినిమా వచ్చి ఆయన పరువు మొత్తం తీసేసింది.
ఇలాంటి నాసిరకం సినిమా తీసారేంటి? అనవసరం గా మా డబ్బులు, సమయం వృధా చేశారు ఏంటి? అని నాటి ప్రేక్షకులు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు.భట్టి విక్రమార్క, కృష్ణలీలలు వంటి మంచి సినిమాలు తెరకెక్కించిన జంపనా చంద్రశేఖర్ కూడా కాడెద్దులు ఎకరం నేల తీసి తన పేరును అంతా పోగొట్టుకున్నారు.
వీక్ కథాబలం కలిగిన సినిమాను రూపొందించినందుకు గాను జంపనా ని కూడా అలనాటి ప్రేక్షకులు తీవ్రంగా విమర్శించారు.
అయితే ఈ సినిమా మొదటిరోజు మొదటి షో తర్వాత థియేటర్ల నుంచి తీసేశారు.దీనితో ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలు ఇక చలనచిత్ర రంగం వైపు అస్సలు రామని చెప్పి తమ స్వస్థలమైన ప్రకాశం జిల్లా కి వెళ్ళిపోయారట.అయితే ఈ సినిమా ఈటీవీ ఛానల్ వద్ద తప్ప మిగతా ఎక్కడా కూడా అందుబాటులో ఉండకపోయేది.2 ఏళ్ల క్రితం “తెలుగు మూవీ కేఫ్” అనే ఒక యూట్యూబ్ ఛానల్ కాడెద్దులు ఎకరం నేల మూవీ ని అప్లోడ్ చేసింది.మీకు ఆసక్తి ఉంటే ఒక్క షో తో నే తీసేసిన ఈ ఎన్టీఆర్ సినిమా ని మీరు కూడా చూడొచ్చు.
ఈ సినిమా తరువాత తెరకెక్కిన సీతారాముల కళ్యాణం సినిమా ఎన్టీఆర్ కి ఘన విజయాన్ని సాధించి పెట్టింది.