మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను చిట్టి బాబు పాత్రలో రంగస్థలం సినిమాలో చూపించిన దర్శకుడు సుకుమార్ రికార్డుల వర్షం కురిపించాడు.సమంత హీరోయిన్ గా నటించిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ ని దక్కించుకున్న విషయం తెల్సిందే.
సినిమాలో చిట్టి బాబు పాత్రలో చరణ్ నటించిన తీరు ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.భారీ ఎత్తున నెలకొన్న అంచనాల నడుమ విడుదల అయిన రంగస్థలం సినిమా లో చరణ్ చెవిటి వాడి పాత్రలో చూసి జనాలు మొదట షాక్ అయ్యారు.
ఆ తర్వాత సినిమా రేంజ్ ను చూసి నోరు వెళ్లబెట్టారు.ఇప్పుడు అంతకు మించిన స్టఫ్ తో పుష్ప సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా పుష్ప సినిమా లో అల్లు అర్జున్ పాత్ర అతడి కెరీర్ లోనే ఎప్పటికి నిలిచి పోయే విధంగా ఉంటుందట.అలాగే ఇలాంటి పాత్రను తెలుగు సినిమా స్క్రీన్ పై ప్రేక్షకులు ఎప్పుడు చూడలేదు అంటున్నారు.

పుష్ప సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది కనుక సినిమాను వచ్చే ఏడాదో లేదంటే ఈ ఏడాది దసరా లేదా చివర్లో విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావించారు.కాని అనూహ్యంగా పుష్ప సినిమాను ఆగస్టు 13న స్వాతంత్య్ర దినోత్సవం వారం లో విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా విడుదల విషయంలో నెల కొన్నిసందిగ్దం మొత్తం క్లీయర్ అవ్వడంతో పాటు సినిమాలో బన్నీ లుక్ ను చూస్తూ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.
సుకుమార్ సినిమా రేంజ్ ఏంటో ఖచ్చితంగా పుష్ప నిరూపిస్తుందని అంటున్నారు.రంగస్థలం సినిమాన ను మించి పుష్ప సినిమా ఉంటుందని ఖచ్చితంగా మరో రేంజ్ లో సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ చకచక జరుగుతోంది.బన్నీ గెటప్ చూస్తుంటే పుష్ప రేంజ్ మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు.ఈ పోస్టర్ సాక్ష్యంగా సినిమా ఖచ్చితంగా రంగస్థలం ను మించి ఉంటుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.