మెగా హీరో నాగబాబు( Naga Babu ) తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) త్వరలో పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే.వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా లవ్ ఉన్నారు.
అయితే ఆ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవలె ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటి అయ్యారు.
త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది.ఇటీవల ఈ జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇక ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌ను( destination wedding ) జరుపుకుంటున్నారు.అందులో భాగంగా వరుణ్, లావణ్యలు వారికీ ఇష్టమైన దేశం ఇటలీలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది అది నిజం చేస్తూ.ఇటలీలోని టస్కానీలో( Tuscany, Italy ) ఈ జంట పెళ్లి చేసుకుంటున్నారు.ఈ పెళ్లి కూడా చాలా కొద్దిమంది సమక్షంలో జరుగునుంది.నవంబర్ 1న ఈ స్టార్ కపుల్ వివాహా బంధంతో ఒకటి కానున్నారు.ఇక ఇప్పటికే వీరిద్దరూ ఇటలీకి బయలుదేరి వెళ్లారు.
ఈ విషయాన్ని వరుణ్ తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు.ఇక వీరి పెళ్లి నాలుగు రోజుల పాటు జరగనుంది.
ఈ వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు.
గెస్ట్ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్( Megastar Chiranjeevi, Pawan Kalyan ) లతో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లు కూడా ఉన్నారు.వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా ప్రైవేట్‌గా జరిగిన సంగతి తెలిసిందే.అయితే రిషెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ఉండనుందట.
ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ హాజరు కానున్నారట.ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ వరసగా సినిమాల్లో నటిస్తన్న తెలిసిందే.
లావణ్య చాలా కాలం నుంచి ఈ సినిమాలకు దూరంగా ఉంటోంది.లావణ్య సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి కారణం వరుణ్ తేజ్ అని కూడా తెలుస్తోంది.