ఈ ప్రశ్నలకు సమాధానాలేవి బన్నీ.. మూవీ చూడాలంటే అలా చేయడం సాధ్యం కాదా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే రాజకీయాలలో సంధ్య థియేటర్ ఘటన( Sandhya Theatre Incident ) సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఎప్పుడు లేనిది ఈ విషయంలో అల్లు అర్జున్( Allu Arjun ) దారుణమైన కామెంట్లను ఎదుర్కొంటున్నారు.

 Allu Arjun Many Options To Watch Movies Details, Tollywood, Allu Arjun, Sandhya-TeluguStop.com

అల్లు అర్జున్ పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.

ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందిస్తూ.మూడేళ్ల నా కష్టాన్ని థియేటర్లో చూడాలి అనుకున్నాను.

అందుకే సంధ్య థియేటర్ కు వెళ్లాను అని హీరో అల్లు అర్జున్ చెబుతున్నారు.అయితే ఇది ఒకింత నిజమే అయినప్పటికీ.

ఈ విషయంపై బన్నీకి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Telugu Allu Arjun, Alluarjun, Negitive, Pushpa, Pushpa Rule, Sandhya Theater, Sa

మీరు వెళ్లాలనుకుంటే ఏ థియేటర్ వరకు వెళ్ళకూడదు కానీ ఒక రౌడీ ఎక్కువగా ఉన్న సంధ్యా థియేటర్ కు మాత్రమే ఎందుకు వెళ్లారు? ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్లవచ్చు కదా? లేదంటే సినిమా ప్రారంభమైన తర్వాత లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత వెళ్లొచ్చు కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు? ఇప్పటికే చాలామంది హీరోలు ఇలా చేశారు కదా అంటూ బన్నీ ని నిలదీస్తున్నారు.కేవలం బన్నీ దీనిని సాకుగా చెబుతున్నాడు అంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు.ఎందుకంటె తన మూడేళ్ల కష్టాన్ని చూడాలనుకుంటే చాలా మార్గాలు వున్నాయి.

ఒక స్క్రీన్ మొత్తం బ్లాక్ చేసి చూడవచ్చు తన స్వంత ఎఎఎ థియేటర్ లో సైలంట్ గా వెళ్లి, హడావుడి ఎందుకు చేయాలి.

Telugu Allu Arjun, Alluarjun, Negitive, Pushpa, Pushpa Rule, Sandhya Theater, Sa

పర్మిషన్లు అడిగి, తాను ఫలానా థియేటర్లో సినిమా చూస్తానని ముందే లీకులు ఇచ్చి? ఇలా ఎందుకు చేయాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.తాజాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను ( Allu Arjun Press Meet ) పెట్టిన విషయం తెలిసిందే.ఈ విషయం గురించి ప్రశ్నిస్తూ.

అసలు బన్నీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్లు? తాను అనుకున్న పాయింట్లు అన్నీ కాగితం మీద రాసుకుని, రెండు భాషల్లో చెప్పి ముగించారు.మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆలోచన లేనపుడు మీడియాను పిలిచి వారి సమయం ఎందుకు వృధా చేయడం.

రెండు భాషల్లో చెరో వీడియో వదిలితే సరిపోతుంది కదా? మీడియా అంతా బన్నీ ఇంటి దగ్గర మోహరించడం, వేచి వుండడం, ఆలస్యంగా వచ్చిన బన్నీ సారీ చెప్పడం, తను అనుకున్నది చెప్పి చక్కా పోవడం.దేనికోసం ఇదంతా? అంటూ ప్రశ్నిస్తున్నారు.చూసుకుంటే నీ ఘటనపై అల్లు అర్జున్ ఇంత ఎన్ని మాటలు పడాలో, ఈ ఘటనకు ఎప్పుడు ముగింపు పలుకుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube