సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సందీప్ ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఈ ఒక్క మూవీతో రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఈ సినిమా తర్వాత అతని కెరియర్ కూడా పెరిగిపోయింది.
ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ కి వెళ్లి అక్కడ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా కూడా భారీ విజయం సాధించింది.
అనంతరం రన్బీర్ కపూర్ తో యానిమల్ సినిమాను( Animal Movie ) తీసి భారీ సెన్సేసన్ ను క్రియేట్ చేశారు.
దీంతో దేశవ్యాప్తంగా సందీప్ పేరు మార్మోగిపోయింది.తనతో ఒక్క సినిమా చేయాలని ఆశపడే హీరోల సంఖ్య ఇంకా పెరిగిపోయింది.ఈ జాబితాలోకి హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి( Rishab Shetty ) కూడా వచ్చాడు.
కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఆశగా ఉంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.ప్రస్తుతం కాంతార చాప్టర్ 1, జై హనుమాన్,చత్రపతి శివాజీ లాంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.
ఇలాంటి లైనప్ తో ఉండి కూడా సందీప్ తో ఒక సినిమా చేయాలని అతను ఆశపడుతున్నాడు.
ఇదే విషయంపై రిషబ్ శెట్టి స్పందిస్తూ.సందీప్ రెడ్డి వంగ చాలా క్రేజీగా ఆలోచిస్తారు.ఎవ్వరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తాయి.
తన సినిమాలో నటించాలని ఉంది.అతను ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధం అని చెప్పుకొచ్చారు.
మరి ఫ్యూచర్ లో ఏమైనా రిషబ్ శెట్టి సందీప్ రెడ్డి కాంబినేషన్లో సినిమాలు వస్తాయేమో చూడాలి మరి.ఇకపోతే ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న రిషబ్ శెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.అందులో భాగంగానే ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో నటించడానికి ఈ సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండగా మరికొన్ని చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.