ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాలివే.. రికార్డులు క్రియేట్ అయ్యయిగా!

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ కూడా చిన్న చిత్రాలు భారీగానే విడుదలైన విషయం తెలిసిందే.అయితే అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించగా మరికొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి.

 Small Budget Films Shows Huge Impact In Tfi Details, Small Budget Films, Tollywo-TeluguStop.com

ఇంకొన్ని సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచాయి.ఇకపోతే ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సారి కొత్త ఏడాదిని ఆరంభించిందే చిన్న సినిమా.అగ్ర దర్శకుడు కె.

రాఘవేంద్రరావు నిర్మాణంలో, గాయని సునీత తనయుడు ఆకాశ్‌ కథానాయకుడిగా నటించిన సర్కారు నౌకరి సినిమాతో( Sarkaaru Noukari Movie ) తెలుగు బాక్సాఫీస్‌ కొత్త ఏడాదిని ఆరంభించింది.పీరియాడిక్‌ కథతో రూపొందిన ఈ చిత్రం మంచి ప్రయత్నం అనిపించుకుంది కానీ బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్లు రాబట్టలేదు.

Telugu Ambajipeta, Box, Mathu Vadalara, Ooruperu, Small Budget, Tollywood-Movie

హన్సిక మోత్వాని నటించిన 105 మినిట్స్‌ సహా చాలా చిన్న సినిమాలు విడుదల అయ్యాయి కానీ, ప్రభావం చూపించలేదు.తర్వాత ఫిబ్రవరిలో విడుదలైన సుహాస్‌ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌,( Ambajipeta Marriage Band ) సందీప్‌కిషన్‌ ఊరుపేరు బైరవకోన( Ooru Peru Bhairavakona ) చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి.భూతద్దం భాస్కర్‌నారాయణ సినిమా కూడా ఫర్వాలేదనిపించుకుంది.మార్చిలో వచ్చిన విశ్వక్ సేన్ గామి( Gaami ) విజయవంతంగా ప్రదర్శితమైంది.కథ పరంగా సాంకేతికంగా ఆకట్టుకున్న చిత్రమిది.మార్చిలో విడుదలైన షరతులు వర్తిస్తాయి( Sharathulu Varthisthai ) మంచి చిత్రం అనిపించుకుంది.

చైతన్య కుమార్‌ కథానాయకుడిగా, కుమార స్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.కాస్త ఎక్కువ బడ్జెట్‌ తోనే తెరకెక్కిన శ్రీవిష్ణు ఓం భీమ్‌ బుష్‌, ప్రేక్షకుల్ని నవ్వించింది.

Telugu Ambajipeta, Box, Mathu Vadalara, Ooruperu, Small Budget, Tollywood-Movie

గీతాంజలి మళ్లీ వచ్చింది, శ్రీరంగనీతులు, టెనెంట్‌, పారిజాత పర్వం తదితర చిత్రాలతో ఏప్రిల్‌ నెల ఆశలు రేకెత్తించినా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు.ఆ తర్వాత విడుదల అయిన ప్రసన్న వదనం,గం గం గణేషా సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి.ఈ ఏడాదిలో ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలోనే చిన్న చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి.కమిటీ కుర్రోళ్ళు,( Committee Kurrollu ) ఆయ్‌, 35 చిన్న కథ కాడు, మత్తు వదలరా 2( Mathu Vadalara 2 ) మంచి వసూళ్లతో అదరగొట్టాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube