ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాలివే.. రికార్డులు క్రియేట్ అయ్యయిగా!
TeluguStop.com
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ కూడా చిన్న చిత్రాలు భారీగానే విడుదలైన విషయం తెలిసిందే.
అయితే అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించగా మరికొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి.
ఇంకొన్ని సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచాయి.ఇకపోతే ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ సారి కొత్త ఏడాదిని ఆరంభించిందే చిన్న సినిమా.అగ్ర దర్శకుడు కె.
రాఘవేంద్రరావు నిర్మాణంలో, గాయని సునీత తనయుడు ఆకాశ్ కథానాయకుడిగా నటించిన సర్కారు నౌకరి సినిమాతో( Sarkaaru Noukari Movie ) తెలుగు బాక్సాఫీస్ కొత్త ఏడాదిని ఆరంభించింది.
పీరియాడిక్ కథతో రూపొందిన ఈ చిత్రం మంచి ప్రయత్నం అనిపించుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టలేదు.
"""/" /
హన్సిక మోత్వాని నటించిన 105 మినిట్స్ సహా చాలా చిన్న సినిమాలు విడుదల అయ్యాయి కానీ, ప్రభావం చూపించలేదు.
తర్వాత ఫిబ్రవరిలో విడుదలైన సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్,( Ambajipeta Marriage Band ) సందీప్‌కిషన్ ఊరుపేరు బైరవకోన( Ooru Peru Bhairavakona ) చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి.
భూతద్దం భాస్కర్‌నారాయణ సినిమా కూడా ఫర్వాలేదనిపించుకుంది.మార్చిలో వచ్చిన విశ్వక్ సేన్ గామి( Gaami ) విజయవంతంగా ప్రదర్శితమైంది.
కథ పరంగా సాంకేతికంగా ఆకట్టుకున్న చిత్రమిది.మార్చిలో విడుదలైన షరతులు వర్తిస్తాయి( Sharathulu Varthisthai ) మంచి చిత్రం అనిపించుకుంది.
చైతన్య కుమార్ కథానాయకుడిగా, కుమార స్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్, ప్రేక్షకుల్ని నవ్వించింది.
"""/" /
గీతాంజలి మళ్లీ వచ్చింది, శ్రీరంగనీతులు, టెనెంట్, పారిజాత పర్వం తదితర చిత్రాలతో ఏప్రిల్ నెల ఆశలు రేకెత్తించినా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు.
ఆ తర్వాత విడుదల అయిన ప్రసన్న వదనం,గం గం గణేషా సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి.
ఈ ఏడాదిలో ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలోనే చిన్న చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి.
కమిటీ కుర్రోళ్ళు,( Committee Kurrollu ) ఆయ్, 35 చిన్న కథ కాడు, మత్తు వదలరా 2( Mathu Vadalara 2 ) మంచి వసూళ్లతో అదరగొట్టాయి.
బౌండరీలతో రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ప్రపంచ రికార్డుల మోత