మన హిందూ సాంప్రదాయాల ప్రకారం స్త్రీలు ఏదైనా ఆలయానికి వెళితే సాంప్రదాయమైన దుస్తులు, నగలు, పువ్వులు ధరించి నిండు ముత్తయిదువుల ఆలయానికి వెళ్లి ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందుతారు.కానీ కలియుగ దైవంగా ఎంతో పేరుగాంచిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో మాత్రం భక్తులు ఎటువంటి పరిస్థితులలో కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు.
వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు పొరపాటున పువ్వులు పెట్టుకుని వెళ్ళిన చెక్ పోస్ట్ దగ్గర, క్యూలైన్లలో పువ్వులను తీసేపిచ్చి స్వామి వారి దర్శనానికి భక్తులను పంపుతారు.అయితే ఈ విధంగా స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఎందుకు పెట్టుకోకూడదో దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
విష్ణు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అయితే, వెంకటేశ్వరస్వామి పుష్ప అలంకార ప్రియుడు.
ఈ సమయంలోనే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి కొన్ని వేల రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తుంటారు.సాధారణంగా శ్రీ రంగాన్ని భోగి మండపం అని, కంచి మండపాన్ని త్యాగ మండపం అంటారు.
అదేవిధంగా తిరుమలను పుష్ప మండపం అని పిలుస్తారు.అందుకోసమే తిరుమలలో పూసే ప్రతి పువ్వు మనుషులకు కాకుండా ఆ భగవంతుడికే సమర్పించాలని అక్కడి ప్రజలు భావిస్తారు.
అందుకోసమే ఇక్కడ మహిళలు లేదా పురుషులు సైతం పువ్వులను ధరించరాదనే నియమం ఉంది.
కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీవారి దర్శనార్థం రోజుకు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు.

ఈ క్రమంలోనే తిరుమలకు వెళ్లే భక్తులు కూడా పూలు పెట్టుకోరాదనే నియమం ఉంది.ఈ విషయాన్ని పదే పదే తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు భక్తులకు గుర్తు చేస్తూ ఉంటారు.అందుకోసమే తిరుమలకు వెళ్లే భక్తులు ఎవరూ కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు.