టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ.
అందులో భాగంగానే ఇప్పుడు విజయ్ తాజాగా నటించిన చిత్రం కింగ్ డమ్.( Kingdom Movie ) గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) వాయిస్ ఓవర్ ఇచ్చారు.అలా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

కాగా తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ ఈ విషయం గురించి స్పందించారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసిన సమయంలోనే ఎన్టీఆర్ అన్న చెబితే బాగుంటుంది అని అనుకున్నాము.ఆయనని కలిసి విషయం చెప్పాము.కాసేపు ముచ్చటించిన తర్వాత ఈ సాయంత్రం చేసేద్దాం అన్నారు.దర్శకుడు చెన్నైలో ఉన్నారని, టీజర్ కు సంబంధించిన మ్యూజిక్ వర్క్ లో బిజీగా ఉన్నారని చెప్పాము.
ఏం ఫర్వాలేదు.నువ్వు ఉన్నావ్ గా అని అన్నారు.
ఆ డైలాగ్స్ ఆయనకు అంతగా నచ్చాయి.అద్భుతంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు.

అన్నను అంతకుముందు నేను ఎక్కువ సార్లు మీట్ అవ్వకపోయినా మా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రత్యేకం అనిపించింది.హిందీ వెర్షన్ కోసం రణ్ బీర్ కపూర్ ని, తమిళ్ వెర్షన్ కోసం సూర్య సర్ ని అడగ్గానే ఓకే చెప్పారు అని తెలిపారు విజయ్ దేవరకొండ.ఈ సందర్భంగా విజయ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.ఈ సినిమా కంటే ముందు ఖుషి సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఇప్పుడు త్వరలో కింగ్ డమ్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా మే 3వ తేదీన విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.